ETV Bharat / state

పరిచయం ప్రేమగా మారింది - ఆ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది! - ఆ ఒక్క డెసిషన్​తో? - SUICIDE OF LOVERS IN PEDAKAKANI

హైదరాబాద్​లో పరిచయం ప్రేమగా మారి ఒక్కటయ్యారు - పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రాణాలు వదిలారు

SUICIDE OF LOVERS IN PEDAKAKANI
SUICIDE IN PEDAKAKANI IN GUNTUR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 1:00 PM IST

Updated : Oct 18, 2024, 1:06 PM IST

Suicide in Pedakakani Guntur : ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పెదకాకానికి చెందిన దానబోయిన మహేశ్‌ (22), నండ్రు శైలు (21)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే, పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్‌ అనే యువకుడు, నందిగామ మండలం రుద్రవరా గ్రామానికి చెందిన శైలు అనే యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేశ్‌ డిప్లొమా చేశాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ మొబైల్‌ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో శైలు పరిచయమైంది. వీరు రోజూ మాట్లాడుకునేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇటీవలే వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.

బయటికి వెళ్లి ప్రాణాలు విడిచి : 10 రోజుల క్రితం యువకుడి ఇష్టం మేరకు తన తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబసభ్యులు మాత్రం కొంత అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా పండుగ సమయంలో శైలు, మహేశ్‌ తమ స్వగ్రామాలకు వెళ్లారు. బాగా ఆలోచించి ఇద్దరు తమ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టుకుని విలవిలా ఏడ్చారు. అలా చూసేసరికి వారి బాధకు చుట్టు పక్కల ఉన్న వారందరి కళ్లూ చమర్చాయి.

సమస్య ఏదైనా చావే దిక్కు అన్నట్లు : ఈ మధ్య ఆత్మహత్య కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. నేటి యువత సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయటం లేదు. సమస్య ఏదైనా ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారమనుకుంటున్నారు. దీంతో వారిపై ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పోలీసులు సైతం ఇలాంటి ఘటనలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ప్రేమికులు, యువకుల ఆత్మహత్యలు మాత్రం ఆగటం లేదు.

నల్గొండ యువతి ఆత్మహత్య కేసులో నిందితులు అరెస్ట్

వివాహమైన నెల నుంచే వేధింపులు - సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్

Last Updated : Oct 18, 2024, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.