ETV Bharat / state

ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు - ప్రభుత్వ నిర్ణయంతో సర్వత్రా హర్షం - Free Books to Inter Students

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 9:37 PM IST

Govt Decision to Provide Free Books to Inter Students: ఇంటర్ విద్యార్ధులకు పుస్తకాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వలేదన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల వద్ద తాము పుస్తకాలు తీసుకుని చదువుకునే వాళ్లమని వాపోయారు. తమకు పుస్తకాలు ఇస్తే ఇంకా బాగా చదువుకుంటామని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్ధి సంఘాలూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

free_books_to_inter_students
free_books_to_inter_students (ETV Bharat)

Govt Decision to Provide Free Books to Inter Students: ఐదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పుస్తకాల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీనియర్ల బుక్స్‌ సాయంతో నోట్స్‌ రాసుకుని మెుదటి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పీడీఎఫ్​లు జెరాక్స్‌లు తీసుకుంటున్నామని విద్యార్థులు వాపోయారు. ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లలో విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జగన్ హామీలు మాటలకే పరిమితమయ్యాయి. పేద విద్యార్ధులకు అండగా నిలవాల్సిన గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులను గాలికి వదిలేసింది. విద్యార్ధులకు చదువుకునేందుకు పుస్తకాలను అందించలేదు. విద్యార్ధుల వద్ద పుస్తకాలు లేకపోవడంతో వారికి చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడేవారు. ఇదంతా గతం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కరంపై దృష్టి పెట్టింది. మంత్రి నారా లోకేశ్ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటనతో ఇంటర్ విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు - బీపీసీఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు - CM met BPCL Representatives

మంత్రి లోకేశ్​ ప్రకటనతో విద్యాశాఖ అధికారులు ఆయా కళాశాలల నుంచి నివేదికలు సేకరించారు. ఈ నెల 12న పుస్తకాలు సరఫరా చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 472 జూనియర్ కళాశాలు ఉండగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రథమ సంవత్సర విద్యార్ధులు 2,102 మంది ఉండగా రెండవ సంవత్సరం విద్యార్ధులు 1,974 మంది చదువుకుంటున్నారు. ఇంకా ప్రవేశాలు జరగుతున్న తరుణంలో రాష్ట్రంలో విద్యార్ధుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.

విద్యార్ధులకు పుస్తకాలు అందించాలని గత ప్రభుత్వంలో విద్యార్ధి సంఘాల ప్రతినిధులు ఆందోళనలు, నిరసనలు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్ధుల సమస్యలపై దృష్టి సారించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్ధి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడిన విద్యార్ధులు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తే మంచి ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

ఓడిన వైకల్యం- ఈ యువ క్రికెటర్ల సంకల్పానికి విజయం దాసోహం! - Deaf and Dumb Cricket Players

రాజ్​ తరుణ్​పై కేసు నమోదు- తానే అబార్షన్​ చేయించాడన్న లావణ్య - POLICE FILE A CASE ACTOR RAJ TARUN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.