ETV Bharat / state

హాస్టల్ నుంచి 40 మంది విద్యార్థులు పరారీ - కారణాలు తెలిస్తే షాక్ ! - students escape from hostel

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Students Escape from Hostel in Palnadu District: పల్నాడు జిల్లాలోని ఓ హాస్ట్​ల్​లో పదో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. పదో తరగతి విద్యార్థులంతా ఒక్క సారిగా హాస్టల్​ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో 27 మందిని సిబ్బంది పట్టుకోగా, మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండలపైకి వెళ్లారు. ఉపాధ్యాయుల సమాచారంతో, పరారైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు.

Students Escape from Hostel
Students Escape from Hostel (ETV Bharat)

Students Escape from Hostel in Palnadu District: పల్నాడు జిల్లాలో హాస్టల్ నుంచి విద్యార్థులు పరారైన ఘటన కలకలం రేపింది. యడ్లపాడు మండలం వంకాయలపాడులో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి 40 మంది పదో తరగతి విద్యార్థులు సోమవారం ఇవాళ ఉదయం వెళ్లిపోయారు. మిగతా విద్యార్థులు సోలార్ ఫెన్సింగ్‌ వేసిన గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది పట్టుకున్నారు.

ఈ పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులందరూ ఇవాళ ఉదయం సోలార్ ఫెన్సింగ్​తో ఉన్న గోడను దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే 27 మందిని పట్టుకున్నారు. మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండవీడు కొండలపైకి వెళ్లారు.

విద్యార్థులు ఎటు వెళ్లారనే విషయంపై ఉపాధ్యాయులు చుట్టుపక్కల ఆరా తీయగా విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులతో కలిసి కొండల వద్దకు వెళ్లి విద్యార్థులను తీసుకుని వచ్చారు. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్సై బాలకృష్ణ ఇందులో ఉన్నారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థులను విచారించారు. వారు వెళ్లిపోవటానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు చెప్పిన కారణాలు ఏంటంటే: వసతి గృహంలో సౌకర్యాలు సరిగా లేవని, ఆహారం నాణ్యత లేదని, ఆటలు ఆడించటం లేదని, విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారని, ఉపాధ్యాయులు ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. ప్రతి రోజూ స్లిప్ టెస్టులు పెడుతున్నారు. అన్ని సబ్జెక్టులు ఒకేసారి పెడుతుండటంతో రాయలేకపోతున్నామని తెలిపారు. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు వార్డెన్, ఉపాధ్యాయులను పిలిచి మాట్లాడారు. వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తల్లిదండ్రులు కంగారు పడతారని, కాబట్టి ఈ విధంగా ఎప్పుడూ చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని, అప్పుడప్పుడూ తాను వస్తానని పోలీసులు తెలిపారు.

"తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏదైనా సమస్య చెబితే, ఎందుకు మీరు చెప్పారు అని ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. అదే విధంగా ఫుడ్ బాగాలేదని చెప్పారు. విద్యార్థులు బయటకు వెళ్తే గోడ దూకి వెళ్తున్నారని, అప్పుడు అలా వెళ్లొద్దని ఉపాధ్యాయులు తిడుతున్నారని అన్నారు. అదే విధంగా కొంతమంది టీచర్లు తినకూడని పదార్థాలు తింటున్నారని విద్యార్థులు చెప్తున్నారు. హెయిర్ కటింగ్​కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పారు". - నాగేశ్వరరావు, నరసరావుపేట డీఎస్పీ

'నా మాటే వినరా అంటూ' ఓ ప్రిన్సిపల్ నిర్వాకం - విద్యార్థినులతో రోజుకు 100కు పైగా గుంజీలు - Rampachodavaram Principal Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.