Protest Against Neet in Telangana : నీట్ రద్దు చేయాల్సిందేననే ప్రజా, విద్యార్థి సంఘాలు గళమెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో తెలంగాణ విద్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నీట్, నెట్ సహా విద్యా రంగ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆచార్య హరగోపాల్, ఆచార్య లక్ష్మినారాయణ, పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాల పాల్గొన్నారు. భారత్ వంటి సమాఖ్య దేశంలో కేంద్రీకృత పోటీ పరీక్షలు సరికావని అభిప్రాయపడ్డారు. ఎన్టీఏను రద్దు చేసి.. పరీక్షలను నిర్వహించే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్ నుంచి బయల్దేరారు. అప్రమత్తమైన పోలీసులు గాంధీభవన్ గేట్‌ను మూసివేశారు. యువజన కాంగ్రెస్ శ్రేణుల్ని బయటకు రాకుండా అడ్డుకున్నారు. నీట్‌ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
"ఈ దేశానికి సెంట్రలైస్డ్ పరీక్షలు అవసరం లేదని మేము ముందుగానే చెప్పాం. కానీ ఎన్టీఏ అని ఏజేన్సీని తీసుకువచ్చారు డైరెక్టర్‌ను కూడా తీసీవేశారు. ఇప్పుడు అవతవకలు ఎలాగో జరిగాయి. నీట్ పరీక్షను రద్దు చేయండి. మళ్లీ నీట్ పరీక్ష పెట్టినా మీరు అది సక్రమంగా జరుగుతుందని నమ్మకం ఇవ్వలేరు. టెక్నాలజీతో దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించినప్పుడు బిహార్‌లో పేపర్ లీక్ అయింది. దానికి మిగతా రాష్ట్రాల పిల్లలు ఎందుకు సఫర్ కావాలి. ఎక్కడో ఒక దగ్గర పేపర్ లీక్ అయితే దానికి అన్యాయంగా 24 లక్షల మంది విద్యార్థులు అన్యాయంగా బలైతే దానికి బాధ్యులు ఎవరు" - ఆచార్య హరగోపాల్, పౌరహక్కుల నేత
నీట్ యూజీసీ-పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్‌ని ముట్టడించేందుకు విద్యార్థి, యువజన సంఘాల ప్రయత్నించాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన విద్యార్థి నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నీట్ పరీక్ష పేపర్ లీకైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థి నాయకులు విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : బల్మూరి వెంకట్