ETV Bharat / state

భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు - తప్పని గిరిజనుల కష్టాలు - Heavy Rains Streams Flowing in AP - HEAVY RAINS STREAMS FLOWING IN AP

Streams Flowing With Heavy Rains in Alluri District: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అల్లూరి జిల్లా రంపచోడవరంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాకపోకలు స్తంభించి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం గిన్నెలకోటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన నిధులతో వంతెన పూర్తి చేయలేదు. నిత్యం సమస్యల సుడిగుండంలోనే వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు.

Streams Flowing With Heavy Rains
Streams Flowing With Heavy Rains (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 9:28 PM IST

Streams Flowing With Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్లూరి జిల్లా పాడేరులో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలకు కొండల మధ్య నుంచి భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో గిరిజనులు రహదారిపై వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం, రెండు ఇళ్లు నేలమట్టం - తప్పిన ప్రాణాపాయం - Two Houses Collapsed

ఒడిశా సరిహద్దు ప్రాంతం పెదబయలు మండలం గిన్నెలకోటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన నిధులతో వంతెన పూర్తి చేయలేదు. గ్రామానికి వెళ్లేందుకు కొండల మధ్య ప్రయాణం అంటే సాహసమనే చెప్పాలి. గిరిజనులు ఒకరు చేయిని మరొకరు పట్టుకుని ఉద్ధృతమైన నీటి ప్రవాహం మధ్య గ్రామానికి వెళుతున్నారు. నిత్యం ఇదే విధంగా సమస్యల సుడిగుండంలో వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు.

అల్లూరి జిల్లా రంపచోడవరంలో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం అధికంగా కురవడంతో భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ, సూరంపాలెం జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వర్షపు నీరు రహదారులపై చేరి పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిస్తే జలాశయాల్లో నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఐటీడీఏ అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

కృష్ణా జిల్లాలో భారీ వర్షం - వరి నారు మడులు పోస్తున్న అన్నదాతలు - Farmers Happy Pouring Rice Paddies

పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలకు రెండు ఇళ్లు నేలకూలాయి. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలోని తంగుడు పకీర నాయుడు, చింతల విమల రాణి ఇళ్లు నేలమట్టమయ్యాయి. చిన్నారులతో నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావటంతో భయంతో ఇళ్లలోని వారు బయటకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. ఘటనలో ప్రాణాపాయం తప్పటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వర్షానికి వైరా కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాములూరు- పల్లంపల్లి రహదారిపై వరద ప్రవహించడం వల్ల ద్విచక్ర వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే విధంగా గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగు పొంగిపొర్లుతుంది. భారీ వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ముంబయిలో వర్ష బీభత్సం- 6గంటల్లో 300MM వాన- ఎటు చూసినా నీరే! - Mumbai Rainfall

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.