ETV Bharat / state

కరీంనగర్‌లో భారీవర్షాలు, ఈదురు గాలుల బీభత్సం - సీఎం రేవంత్ రెడ్డి సహా బీజేపీ సభలు రద్దు - Stormy Winds in Karimnagar District

Stormy Winds in Karimnagar District : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాలులు పార్టీలను కలవరపెడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలు వాయిదా పడి, సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ముఖ్యనాయకుల సమావేశాలు రద్దయ్యాయి. గాలుల ప్రభావానికి పలుచోట్ల అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Heavy Rains in Telangana
Stormy Winds in Karimnagar District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 5:32 PM IST

Updated : May 7, 2024, 6:09 PM IST

Stormy Winds in Karimnagar District : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాలులు పార్టీలను కలవరపెడుతున్నాయి. మంథనిలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా, అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి.

ఈదురు గాలుల ఎఫెక్ట్‌ - కాంగ్రెస్‌, బీజేపీ సభలు రద్దు : ఆ సమయంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలానే కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి.

మరోపక్క కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వేములవాడ, జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కరీంనగర్‌తో పాటు హుజురాబాద్‌లో ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

కరీంనగర్‌లో ఈదురు గాలుల బీభత్సం - కాంగ్రెస్‌, బీజేపీ సభలు రద్దు (ETV Bharat)

Heavy Rains in Telangana : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్‌లోని 300 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. వరంగల్ తిమ్మాపూర్‌లో మోదీ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఈదురు గాలులకు సభావేదిక కూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది.

ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షంతో తూకం కోసం ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. వ్యవసాయ మార్కెట్లో కురిసిన అకాల వర్షం నీటి నిల్వ ఉండటంతో కొంతమేరకు ధాన్యం కొట్టుకుపోయింది. రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి రైతులు నష్టపోయారు.

రాష్ట్ర ప్రజలకు ఐఎండీ హెచ్చరిక - 2 రోజులపాటు భారీ వర్షాలు - ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు - Telangana Weather Report

అత్యంత వేడి సంవత్సరంగా 2024 - చరిత్రలోనే టాప్​ 5లో ఒకటి - 2024 IS THE HOTTEST YEAR

Last Updated : May 7, 2024, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.