ETV Bharat / state

చంద్రబాబుపై రాయి దాడికి యత్నం- విజయవాడ డ్రామాపై కూడా తేలుస్తానంటూ ఆగ్రహం - stones thrown on Chandrababu

Stones Thrown on Chandrababu: చంద్రబాబు సభలోనూ దుండగులు రాళ్లు విసిరారు. గాజువాకలో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబుపై రాళ్లు విసిరిన ఘటన కలకలం రేపింది.

గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన దుండగులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 7:46 PM IST

Updated : Apr 14, 2024, 9:30 PM IST

Stones Thrown on Chandrababu: విశాఖపట్నం జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో రాయి దాడి కలకలం రేపింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తనపై రాయితో దాడికి యత్నించిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. నిన్న చీకట్లో సీఎంపై గులకరాయి పడిందని కానీ ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే తనపై రాయి విసిరారని అన్నారు. గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ ఈ పని చేస్తోందని మండిపడ్డారు. తెనాలిలో వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో జగన్​పై జరిగిన రాయి దాడి డ్రామా గురించి కూడా తేలుస్తానంటూ చంద్రబాబు హెచ్చరించారు. గత ఎన్నికలప్పుడు కూడా తనపై రాళ్లు వేశారన్న ఆయన, క్లైమోర్‌ మైన్స్‌కే భయపడలేదని, ఈ రాళ్లకు భయపడతానా అని పేర్కొన్నారు. నిన్న సీఎంపైన చీకట్లో గులకరాయి పడింది. జగన్‌ సభలో కరెంటు పోయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్‌ బంద్‌ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులు చేస్తే చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా అని మండిపడ్డారు.

జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారన్న చంద్రబాబు, అదే విధంగా బాబాయి హత్యను తన మీదకు నెట్టాలని ప్రయత్నించారని అన్నారు. విజయవాడలో జగన్​పై జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించామన్న చంద్రబాబు, పేటీఎం బ్యాచ్‌ కుక్కలు ఇష్టానుసారంగా మొరిగాయని ధ్వజమెత్తారు. రాళ్లు తానే వేయించినట్లు కొందరు మాట్లాడారని’ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్​పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి- తెనాలి వారాహి యాత్రలో ఘటన - attack on pawan kalyan varahi yatra

చంద్రబాబుపై రాయి దాడికి యత్నం

Last Updated : Apr 14, 2024, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.