Stone Attack on CM Jagan Case Update: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. మూడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో నిందితుడిని విచారించాలని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. గురు, శుక్ర, శనివారాలు నిందితుడిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.
సీఎంపై రాయి దాడి కేసుతో నాకు సంబంధం లేదు: దుర్గారావు - stone Pelting Case Suspect released
ఈ నేపథ్యంలో రేపటి నుంచి శనివారం సాయంత్రం వరకు పోలీసులు నిందితుడు సతీష్‌ను విచారించనున్నారు. ప్రస్తుతం సతీష్ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిందితుడు సతీష్‌ను విచారించి ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే సమాచారం రాబట్టేందుకు 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించాలని కోరతూ అజిత్ సింగ్ నగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విజయవాడ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ ముగిసింది. నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్ దాఖలు చేశారు. మంగళవారం ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు నిందితుడిని కస్టడీకి ఇస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం జగన్‌పై రాయి దాడి కేసు - అనేక నాటకీయ పరిణామాల మధ్య దుర్గారావు విడుదల - Durga Rao Release
Stone Attack on CM Jagan Incident: 'మేమంతా సిద్ధం' కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న సీఎం జగన్ బస్సు యాత్రలో పాల్గొన్నారు. సింగ్‌నగర్‌లో గంగానమ్మ గుడి వద్ద వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద గుంపులో నుంచి వచ్చిన రాయి తగిలి సీఎం జగన్‌కు స్వల్ప గాయమైంది. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌కూ రాయి తగిలి స్వల్ప గాయమైంది.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. రాయి దాడి ఘటనలో సీఎం జగన్‌కు స్వల్ప గాయం అవటంతో ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగిసిన తర్వాత భారతీ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు.