State Wide Strike Against Kolkata Doctor Incident : కోల్‌కత్తాలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్యులు రోడ్డెక్కారు. వైద్య సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు. డాక్టర్ల ఆందోళనలతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. మహిళా డాక్టర్లపై హత్యాచార ఘటనలను అరికట్టాలని అల్లూరి జిల్లా రంపచోడవరం ఏరియా ఆస్పత్రి డాకర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్‌కతాలో వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై ఇటువంటి దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కోల్కతా ఆర్జీకార్ వైద్య కళాశాల ఆసుపత్రిలోని జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని ఖండిస్తూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారం చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాము ఇంటికంటే హాస్పిటల్లోనే ఎక్కువ సమయం ఉంటామని, ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే తమ ప్రాణాలే తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
హాస్పిటల్లోనే మహిళా వైద్యులకు, మహిళలకు రక్షణ కల్పించలేక పోతున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాలలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ ఘటన చూసి తమ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని, ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు.
Doctors Rally in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐఎమ్ఏ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామంటూ అనపర్తి మెయిన్ రోడ్లో నిరసన చేపట్టారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, అనపర్తి ఐఎంఏ అధ్యక్షుడు రామగురెడ్డి డాక్టర్లతో కలిసి అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి లోని జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. జిల్లా ఆస్పత్రి నుంచి తెంబూరు రోడ్డు మీదుగా నిరసన ర్యాలీ అనంతరం ఇందిరా కూడలిలో మానవహారం నిర్వహించారు. మహిళా వైద్యులకు భద్రత కల్పించాలని, ప్రత్యేక చట్టాలు అమలు చేసి రక్షణగా నిలవాలని నినాదాలు చేశారు.
ధర్మవరంలో వైద్యులు ర్యాలీ చేశారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేశారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐఎంఏ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. మదనపల్లి సరోజన ఆస్పత్రి నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. బాధితురాలికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case