ETV Bharat / state

ముందు నమ్మించారు - తర్వాత రూ. 200 కోట్లతో నిండా ముంచారు - 200 CRORE FRAUD IN HYDERABAD

200 Crore Fraud Case in Hyderabad : బిడ్డల ఉన్నత భవిష్యత్‌కు కొందరు, వారి పెళ్లిళ్ల కోసం మరికొందరు. ఇలా దాచుకున్న మధ్యతరగతి కష్టార్జితం ఓ ఫైనాన్స్‌ కంపెనీ పాలైంది. అధిక వడ్డీ కోసం ఆశ చూపిన ఉన్నతాధికారి మాటలు నమ్మి నిండామునిగారు. దాదాపు 200 కోట్లు పెట్టుబడి పెట్టిన బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డెక్కారు. అధిక వడ్డీ పేరుతో రాజధానిలో వెలుగు చూసిన ప్రియాంక ఎంటర్‌ప్రైజస్‌ మోసం వందల మందిని రోడ్డున పడేలా చేసింది.

Sri Priyanka Enterprises Fraud in Hyderabad
200 Crore Fraud Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 10:08 AM IST

ముందు నమ్మించారు - రూ. 200 కోట్లతో నిండా ముంచారు (ETV Bharat)

Sri Priyanka Enterprises Fraud in Hyderabad : కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ హైదరబాద్ అబిడ్స్‌లోని అతని కుమారుడు శ్రీహర్షతో కలిసి ప్రింటింగ్ సంబంధించిన వస్తువులు సరఫరా చేసే వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ అనే రెండు సంస్థలను ప్రారంభించారు. హైదారాబాద్, విజయవాడ, బెంగళూరులో బ్రాంచులను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపార అవసరాల కోసం పలువురి నుంచి తమ కంపెనీలో పెట్టుబడులు ఆశించి, 15 నుంచి 18 శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికారు.

అధిక వడ్డీ అనడంతో ఆశపడి రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 537 మంది నుంచి దాదాపు 200 కోట్లు వసూలు చేశారు. జనవరి వరకి వడ్డీ ఇచ్చిన నేతాజీ అప్పటి నుంచి ఇవ్వడం నిలిపివేశాడు. అప్పటి నుంచి అడుగుతుంటే ఇస్తా ఇస్తా అంటూ నమ్మబలికాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన పెట్టుబడుదారులు భవిష్యత్‌ కోసం దాచుకున్న సొమ్మంతా కంపెనీలో పెట్టామని న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.

వడ్డీ ద్వారానే జీవితం గడుస్తుందని ఆశతో : మేకా నేతాజి భార్య నిమ్మగడ్డ వాణీబాల అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సహా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మేకా నేతాజి సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ఆమె ప్రోత్సహించినట్టు బాధితులు తెలిపారు. బ్యాంకులో వడ్డీ ఎక్కువగా రాదని, తన భర్త కంపెనీలో 18 శాతం వరకూ వడ్డీ పొందవచ్చని చెప్పి అందరితో పెట్టుబడి పెట్టించినట్లు బాధితులు వాపోతున్నారు. టెస్కాబ్‌లో ఫించన్‌ లేదని, వడ్డీ ద్వారానే జీవితం గడుస్తుందని ఆశతో వాణీబాల మాటలు నమ్మి సంపాదించుకున్న మొత్తాన్ని ఫైనాన్స్‌ కంపెనీలో పెట్డి మోసపోయామని సంస్థలోని పలువురు విశ్రాంత అధికారులు వాపోయారు.

సస్పెన్షన్​ ఉత్తర్వులు జారీ : వాణీబాల గురించి బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా కొన్ని రోజులుగా సెలవులో ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేసిన సొమ్ము ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. టెస్కాబ్‌ జనరల్‌ మేనేజర్ నిమ్మగడ్డ వాణీబాలను సస్పెండ్‌ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు టెస్కాబ్‌ ఎండీ మురళీధర్‌ తెలిపారు. ఈ నెలలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయా జీతభత్యాల చెల్లింపులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్‌ విచారణ ఉత్తర్వులను ఇంటికి అంటించారు.

'బ్యాంక్​లో పనిచేస్తున్న సిబ్బందికి, బ్యాంక్​ ఖాతాదారులకు, బయట వాళ్లకు అధిక వడ్డీ ఆశ పెట్టారు. ఆమె భర్తకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్​ చేస్తే అధిక వడ్డీ వస్తుందని మాకు చెప్పారు. దీంతో మేము నమ్మి పెట్టుబడి పెట్టాం. తర్వాత పెట్టుబడిదారులు మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే ఏప్రిల్​ 29 గడువు పెట్టి ఏప్రిల్​ 25 నుంచి అందుబాటులో లేరు'- బాధితులు

అధిక వడ్డీ ఆశ చూపారు - రూ.200 కోట్లతో ఉడాయించారు - Investment Fraud in Abids

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.