TDP Government Prioritizes Tourism in State : కూటమి ప్రభుత్వం పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తోంది. సందర్శకులను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా టూర్ ప్యాకేజీలను విరివిగా అందుబాటులోకి తెచ్చారు. కాలానుగుణంగా కొత్త వాటితో పాటు ప్రాధాన్యం ఉన్న వాటిని కొనసాగిస్తున్నారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు.
1. ప్యాకేజి : శక్తి పీఠాల పర్యటన
రోజులు : 3
ధర : పెద్దలకు రూ.5980, పిల్లలకు రూ.4790 (నాన్‌ఏసీ)
ఇలా : మొదటి రోజు విశాఖలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి పిఠాపురం, ధ్రాక్షారామం, విజయవాడ, రెండో రోజు కనకదుర్గ అమ్మవారి దర్శనం, శ్రీశైలం, మూడో రోజు అలంపూర్.
2. ప్యాకేజి : పంచారామాలు
రోజులు : 2
ధర : పెద్దలకు రూ.1,685, పిల్లలకు రూ.1,350
ఇలా : మొదటి రోజు రాత్రి 7.30 గంటలకు విశాఖలో బయలుదేరి రెండో రోజు రాత్రి తిరిగొచ్చేలా ప్రణాళిక చేశారు.
3. ప్యాకేజి : విశాఖ సిటీ టూర్
రోజులు : ఒక రోజు
ధర : పెద్దలకు రూ.760, పిల్లలకు రూ.610, ఏసీ అయితే పెద్దలకు రూ.910, పిల్లలకు రూ.730,
ఇలా : ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.
సందర్శించే ప్రాంతాలు : సింహాచలం, తొట్లకొండ, రుషికొండ బీచ్, కైలాసగిరి, విశాఖ మ్యూజియం, టీయూ-142, కురుసురా జలాంతర్గామి, రుషికొండలోని వేంకటేశ్వర స్వామి ఆలయం.
"గుంజివాడ గుసగుసలు" - జలపాతం అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు
4. ప్యాకేజి : అరకు రైలు, రోడ్డు
రోజులు: ఒక రోజు
ధర : పెద్దలకు రూ.1,710, పిల్లలకు రూ.1,370
ఇలా : ఉదయం 5.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై రాత్రికి తిరిగొస్తారు.
సందర్శనీయ ప్రాంతాలు : పద్మాపురం గార్డెన్స్, గిరిజన సందర్శనాలయం, అనంతగిరి కాఫీ వనం, గాలికొండ వీక్షణ పాయింట్, బొర్రా గుహలు, టైడా జంగిల్ బెల్స్ .
- పర్యాటకులు ఆన్‌లైన్‌లోని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీటీడీసీ.ఇన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. విశాఖ రైల్వేస్టేషన్‌లోని ఏపీటీడీసీ కేంద్రం ద్వారానైనా చేసుకోవచ్చు.
మరికొన్ని ఇలా..
ప్యాకేజి : రాజమహేంద్రవరం- పాపికొండలు (పెద్దలకు రూ.1250, పిల్లలకు రూ.1050)
ప్యాకేజి : విశాఖ-అరకు రోడ్డు (పెద్దలకు రూ.1,590, పిల్లలకు రూ.1,270) విశాఖ రాత్రి పర్యటన (పెద్దలకు రూ.575, పిల్లలకు రూ.460). డిమాండు ఆధారంగా విశాఖ-అరసవల్లి, విశాఖ-పాపికొండలు టూర్ నిర్వహిస్తున్నారు.
ఏసీ బస్సులు కావాలని: ఏపీటీడీసీ ప్యాకేజీలకు నాన్‌ఏసీ బస్సులు నడుపుతుండడంపై పర్యాటకులు అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. ఏసీ బస్సులను వినియోగిస్తే కొంత డిమాండు ఉంటుందని ఆహ్లాదకరంగా పర్యటించొచ్చని డిమాండు చేస్తున్నారు.
రాత్రి 12 గంటల వరకు: విశాఖలో ప్రస్తుతం రాత్రి 12 గంటల వరకు హోటళ్ల నిర్వహణకు అనుమతించడంతో పర్యాటకుల సందడి కొంత పెరగనుంది. గతంలో రాత్రి పది గంటలతో మూసేసేవారు. పర్యాటకులను దృష్టిలో ఈ మార్పులు చేయడంపై హర్షం వ్యక్తం అవుతోంది.
మరింతగా ఊరిస్తోన్న లక్నవరం - మూడో ద్వీపం పర్యాటకానికి సిద్ధం