Southwest Monsoon Has Entered the State: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు రావడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా ఈ రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. జూన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే వీలుంది. రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: రేపు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే వీలుంది. ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది.
కడప, అనంతలో జోరు వాన - కూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు - Rain in AP
పలు జిల్లాల్లో వర్షపాతం నమోదు: ఇవాళ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7మిమీ, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7మిమీ, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33మిమీ, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2మిమీ, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22మిమీ, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
పంట నష్టంపై ప్రభుత్వం మొద్దు నిద్ర- ఈ ఆలస్యం ఎవరి మేలుకోసమో? - Drought Zones
Prakasam District: ప్రకాశం జిల్లా కంభం మండల పరిసర ప్రాంతాలలో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో తీవ్ర ఉక్కపోత నుండి ప్రజలు ఉపశమనం పొందారు. బలమైన ఈదురు గాలులు వీస్తూ ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
Anantapur District: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లాయి. రాయదుర్గం మండలంలో 35.6మిమీ వర్షపాతం నమోదయింది. కనేకల్ మండలంలో 17.0మిమీ, బొమ్మనహాళ్ మండలంలో 27.2మిమీ, గుమ్మగట్ట మండలంలో 25.8మిమీ వర్షపాతం నమోదయింది. బొమ్మనహళ్ మండలంలో భారీ వర్షంతో కబ్బాల వాగు, వేదవతి హగరి పొంగి ప్రవహిస్తున్నాయి. మొక్కజొన్న, పత్తి పంటలు జలమయం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలతో రంగాపురం క్యాంప్, ఉద్దేహళ్ లలో పాడి గేదె, ఆవు మృతి చెందినట్లు రైతులు తెలిపారు.
కొండచరియలు విరిగిపడి 15మంది మృతి- 60మంది గల్లంతు - Landslide Accident In Congo