Special Trains To Tirupati in October : అక్టోబర్ నెలంతా పండుగలే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి ఘనంగా నిర్వహిస్తారు. నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు అంతా ఊరుబాట పడతారు. దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబరు 1వ తేదీ నుంచి నవంబరు 16 తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిమ మధ్య రైల్వే తెలిపింది.
కాచిగూడ-సికింద్రాబాద్ (07063) 7 సర్వీసులు, తిరుపతి నుంచి కాచిగూడ (07064) 7 సర్వీసులు, సికింద్రాబాద్ టూ తిరుపతి (07041) 14 సర్వీసులు, తిరుపతి నుంచి సికింద్రాబాద్ (07042) 14 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని జోన్ సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి రైళ్లు జనగామ, వరంగల్ మార్గంలో కాచిగూడ-తిరుపతి రైళ్లు ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల మార్గంలో రాకపోకలు సాగిస్తాయని వివరించారు.
దసరా కోసం స్పెషల్ బస్సులు : దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకోని ఆర్టీసీ సిద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్సు సర్వీసులు నడిపేందుకు సంస్థ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి 12 వరకు (అక్టోబర్ 3 -12) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇదే సమయంలో స్కూల్, కళాశాలలకు పండగ సెలవులు ఉన్నందున తమ ఊళ్లోకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. దీంతో పండగకు ఉండే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 3 నుంచి 15 వరకు 13 రోజులపాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.
ఆ 12 రైళ్లు రద్దు : నిర్వహణ పనుల కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం తెలిపింది. కాచిగూడ టూ నిజామాబాద్(07596), నిజామాబాద్ నుంచి కాచిగూడ(07593), మేడ్చల్ టూ లింగంపల్లి(47222), లింగంపల్లి నుంచి మేడ్చల్ (47225), మేడ్చల్ టూ సికింద్రాబాద్(47235), సికింద్రాబాద్ టూ మేడ్చల్ (47236), మేడ్చల్ నుంచి సికింద్రాబాద్(47237), సికింద్రాబాద్ టూ మేడ్చల్(47238) మేడ్చల్ నుంచి సికింద్రాబాద్(47242), సికింద్రాబాద్ టూ మేడ్చల్(47245), మేడ్చల్ టూ సికింద్రాబాద్(47228), సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ (47229) రైళ్లు అక్టోబరు 1 నుంచి అదే నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని పేర్కొంది. కాచిగూడ-మెదక్ రైలు(07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించింది.
ప్రయాణికులకు ముఖ్య గమనిక - వర్షాల కారణంగా 481 రైళ్లు, 570 ఆర్టీసీ బస్సులు రద్దు - TRAINS CANCELLED