ETV Bharat / state

వైఎస్‌ జయంతి సందర్భంగా సోనియాగాంధీ లేఖ - ఏం అన్నారంటే? - sonia gandhi Letter about YSR - SONIA GANDHI LETTER ABOUT YSR

Sonia Gandhi Letter about YSR: దేశ, రాష్ట్ర రాజకీయల్లో వైఎస్‌ తనకుంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని సోనియా గాంధీ అన్నారు. వైఎస్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ ఆమె లేఖ రాశారు. అదే విధంగా విమర్శను సద్విమర్శగా తీసుకునే స్వభావం వైఎస్సార్‌ది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొనియాడారు.

Sonia Gandhi Letter about YSR
Sonia Gandhi Letter about YSR (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 10:47 PM IST

Sonia Gandhi Letter about YSR: వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ సోనియాగాంధీ పంపిన లేఖను కాంగ్రెస్‌ నేత మెయ్యప్పన్‌ చదివి వినిపించారు. దేశ, రాష్ట్ర రాజకీయల్లో తనకుంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారని సోనియా కీర్తించారు. రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌కు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోమన్నారు. వైఎస్​ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల మరింత ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తాము ఎప్పుడూ ప్రేరణ పొందుతూనే ఉంటామని సోనియా పేర్కొన్నారు.

CPI Narayana About YSR: రాజకీయ వ్యవస్థలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఓ విలక్షణమైన వ్యక్తి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం శ్రమించేవాడని కొనియాడారు. విమర్శను కూడా సద్విమర్శగా తీసుకునే స్వభావం వైఎస్సార్‌దని అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ జయంతి సభలో నారాయణ పాల్గొన్నారు. ఈ క్రమంలో వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తమకు ఏదైనా కష్టం వస్తే, తాము కనిపించినప్పుడు రాజశేఖర్ రెడ్డి అడిగేవారని తెలిపారు. వైఎస్​ఆర్ ఎన్నో కష్టాలు పడ్డారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడ్డారన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ అభిమానులకు కొదవలేదు : రేవంత్‌రెడ్డి - REVANTH AT YSR Birth Anniversary

KVP Ramachandra Rao Comments About YSR: కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ధైర్యంగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈ క్రమంలో వైఎస్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, వైఎస్‌ ప్రజలకు చేసిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు.

Bhatti Vikramarka About YSR: వైఎస్‌ఆర్‌ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందరో జీవితాలను మలుపు తిప్పిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్ చదివారన్న భట్టి, ఇవాళ ఐటీరంగంలో తెలుగు వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందంటే వైఎస్‌ఆర్‌ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కారణమని తెలిపారు. పైరవీలు లేకుండా ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ గట్టిగా చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం రచ్చబండ నిర్వహిస్తానని చెప్పి వెళ్లారని గుర్తు చేసుకున్నారు.

'వైనాట్​ కాంగ్రెస్'- పార్టీ పునరేకీకరణ దిశగా షర్మిల - Sharmila focus on YSRCP cadre

YSR BIRTH ANNIVERSARY CELEBRATIONS: గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీసీసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి సభ నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ జయంతిలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.

ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ 75వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని జరిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, మంత్రులను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవలే ఆహ్వానించారు. ఈ సభకు జాతీయ నేతలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

రాజశేఖర్‌రెడ్డి అసలైన ప్రజా నాయకుడు - ఆయన స్ఫూర్తితోనే జోడో యాత్ర: రాహుల్ - rahul gandhi Released Video on YSR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.