SOFTWARE ENGINEER COMMITS SUICIDE: కుటుంబ కలహాలతో చిన్న విషయాలకే ఎంతో విలువైన ప్రాణాన్ని బలితీసుంటున్నారు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో కుటుంబం మొత్తం ఆ బాధని అనుభవిస్తున్నారు. ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేస్తోంది.
అంతే కాకుండా టెక్నాలజీని సైతం తప్పుడు మార్గంలో ఉపయోగిస్తున్నారు. తాజాగా మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆన్‌లైన్‌లో విష పదార్థాలను ఆర్డర్ చేయడం విస్తుగొలుపుతోంది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి (29) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయిదు నెలల క్రితం అదే జిల్లా ముసునూరు మండలం తోచిలుకకు చెందిన మొవ్వ మనోజ్ మణికంఠ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.
విష పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి: మనోజ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మియాపూర్‌లోని గోకుల్‌ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన నాగలక్ష్మి, గత నెల 26వ తేదీన విష పదార్థాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు.
బుధవారం ఆమె విషం తాగడంతో గమనించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు హుటాహుటిన కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం నాగలక్ష్మి మృతి చెందడంతో, ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగలక్ష్మి భర్త మనోజ్ వేధింపులతోనే తన కుమార్తె మృతి చెందిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు! - యువకుడి ప్రాణం తీసిన 2 వేలు