ETV Bharat / state

వాళ్లను నమ్మి ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడారో - నట్టేట మునిగినట్టే! - INFLUENCERS PROMOTING ONLINE GAMING

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగులు, గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు - మోసపోతున్న యువత

Social Media Influencers Promoting Online Gaming and Betting
Social Media Influencers Promoting Online Gaming and Betting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2024, 2:46 PM IST

Social Media Influencers Promoting Online Gaming and Betting : సోషల్‌ మీడియాలో ప్రభావశీల వ్యక్తుల పేరుతో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వత్తాసు పలుకుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌, ట్రేడింగ్‌ తదితర యాప్‌లకు ప్రచారం చేస్తూఅమాయక ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ట్రంలో వీటిపై నిషేధమున్నా అవేవీ పట్టనట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గ్యాంబ్లింగ్‌కు అలవాటుపడి వేలాది మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

చట్టప్రకారం చర్యలు : ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చలేక వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటి కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే కొందర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. గ్యాబ్లింగ్‌ను ప్రోత్సహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. కొన్ని నెలలుగా గేమింగ్‌, డేటింగ్‌ యాప్‌లపై సామాజిక మాధ్యమాల్లో ప్రచార వీడియోలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరహా వీడియోల్ని తమ దృష్టికి తీసుకొస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ప్రజలపై ఎంతో కొంత ప్రభావం : ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, రీల్స్‌ చేస్తూ వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. ఈ వీడియోలు వేర్వేరు ఖాతాల ద్వారా కొన్ని లక్షల మందికి చేరుతుంటాయి. ఇలా ఎక్కువ మంది ఫాలోవర్లు, ప్రజలపై ఎంతోకొంత ప్రభావం చూపే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించేందుకు అనేక సంస్థలు పోటీపడుతుంటాయి. దీన్ని బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉండే సైబర్‌ ముఠాలు కొన్ని నకిలీ ట్రేడింగ్‌ వెబ్‌సైట్లు సృష్టించి ఇన్‌ఫ్లుయోన్సర్లతో ప్రచారం చేయిస్తున్నారు.

సరదాగా మొదలెట్టి - వ్యసనంగా మార్చుకుని - ఆన్​లైన్​ గేమ్స్​తో కోట్లలో అప్పులు - తీర్చలేక ఆత్మహత్యలు - Ending Lives For Taking Loans

బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రభావంపై అవగాహన లేని యువత, ఇన్‌ఫ్లుయెన్లర్లు చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్ముతూ మూల్యం చెల్లించుకుంటున్నారు. వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉంటే ఖాతాదారులు తాము రూ. లక్షల్లో సంపాదిస్తున్నామంటూ నమ్మిస్తారు. తాము కొన్ని బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌లు వినియోగిస్తూ ఆదాయం పొందామని కొన్ని నకిలీ వీడియోలు చేసి పోస్ట్‌ చేస్తుంటారు. అవి నిజమేనని యువత భావిస్తున్నారు. ఇదంతా నిజమేనని భావించే కొందరు బెట్టింగ్‌, ట్రేడింగ్‌ చేసి చేస్తూ డబ్బులు పోగొట్టుకుని మోసపోతున్నారు.

క్రిమినల్ చర్యలు ఎదుర్కొవాలి : రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెట్టింగ్, గేమింగ్‌పై గతంలోనే నిషేధం విధించింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ను ప్రోత్సహించినా శిక్షార్హులు అవుతారు. ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్‌కు ప్రచారం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం కూడా నిషేధం. నకిలీ వెబ్‌సైట్లపై ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సరదాతో మొదలై అప్పులోకి నెట్టేస్తుంది - ఎందువల్లో తెలుసా?

ఆన్​లైన్ షాపింగ్ చేస్తున్నారా? తొందరపడితే డబ్బులు పోతాయ్ - జర జాగ్రత్త! - Online Shopping Traps

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.