ETV Bharat / state

హైదరాబాద్​లో త్వరలోనే మరో స్కైవాక్ - ఆ ప్రాంత వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు! - NEW SKYWALK IN HYDERABAD

మెట్రో జంక్షన్​ వద్ద త్వరలో అందుబాటులోకి స్కైవాక్ - ఫ్లైఓవర్​ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

SKYWALK IN HYDERABAD
NEW SKYWALK AT PARADE GROUND (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 12:20 PM IST

New SkyWalk in Parade Ground Metro Station : పరేడ్ గ్రౌండ్ మెట్రో రైలు స్టేషన్ వద్ద కొత్తగా మరో స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో జంక్షన్‌గా ఈ స్టేషన్ నుంచి నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఫ్లైఓవర్ ఉన్న కారణంగా స్టేషన్ నుంచి కిందికి వచ్చి రోడ్డు దాటాల్సి వస్తోంది. అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో, రెండోవైపు ఎల్​ అండ్ టీ మెట్రోకు కేటాయించిన భూములు ఉండటంతో అనుసంధానం కోసం ఈ స్కైవాక్ నిర్మించనున్నారు.

పై వంతెనలున్న చోట మెట్రో స్టేషన్లను రహదారికి ఒక వైపు నిర్మించారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్‌ను ఇలాగే సికింద్రాబాద్ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్​) కళాశాలవైపు నిర్మించారు. రహదారి దాటి రెండో వైపు రావాలంటే చాలామంది ప్రయాణికులకు కష్టతరంగా ఉంది. ప్రయాణికుల ఇబ్బందిని తొలగించేందుకు ఇక్కడ కొత్తగా స్కైవాక్ నిర్మించారు. ఇదే మాదిరి పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద కూడా కొత్తగా నిర్మించబోతున్నారు.

ప్రయాణికుల సౌకర్యం దృష్యా : ఈ స్కైవాక్​ను ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ సిద్దమవుతోంది. జంట నగరాల్లో కాలినడకన వెళ్లే వారి కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. నగరంలోని పెద్ద పెద్ద చౌరస్తాల్లో పాదచారుల సౌకర్యం కోసం స్కైవాక్​లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జంక్షన్​లలో వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కైవాక్​లను నిర్మిస్తున్నారు.

పరేడ్​ గ్రౌండ్​ మెట్రో స్టేషన్​ వద్ద ఇది అందుబాటులోకి వస్తే కాలినడకన వెళ్లే వారు ఎక్కడా రోడ్డును దాటే అవసరం లేకుండా, స్కైవాక్ ఎక్కితే పైనుంచి అటు నుంచి ఇటువైపు, ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు సులభంగా వారి గమ్యస్థానాలకు రాకపోకలు సాగించవచ్చు. మెట్రో స్టేషన్​కు ఈ స్కైవాక్​ను నేరుగా అనుసంధానించనున్నారు. మెట్రో స్టేషన్​ చేరుకునే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు.

గతంలో నిర్మించిన ఉప్పల్​ స్కైవాక్​ ద్వారా ప్రయాణికులు చాలా సులభంగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీనిని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో హెచ్​ఎండీఎ నిర్మించింది. దీనికి దాదాపుగా రూ.25 కోట్లను ఖర్చు చేసింది. సీఎం రేవంత్​ రెడ్డి ట్యాంక్​బండ్​ చుట్టూ స్కైవాక్​ నిర్మించనున్నట్లు గతంలో ఓ సందర్భంలో తెలిపారు.

Uppal Skywalk in Hyderabad : ఉప్పల్‌ స్కైవాక్‌ ప్రారంభం.. ప్రత్యేకతలివీ..

సికింద్రాబాద్​లో రూ. 6 కోట్లతో స్కై వాక్ బ్రిడ్జి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.