SIT Formed to Investigate Post Poll Violence in AP : రాష్ట్రంలో పోలింగ్ హింసాకాండను నిగ్గు తేల్చే పని మొదలైంది. ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లనూ జోడించాలని సిట్‌ను డీజీపీ ఆదేశించారు.
ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటుకు కసరత్తు పూర్తి- ఈ రాత్రికి ప్రకటన - SIT Inquiry On Election Violence
రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై విచారణను ఎన్నికల సంఘం సిట్‌కి అప్పగించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని 13 మందితో సిట్ చేస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. సిట్ బృందంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవి మనోహరా చారీ, గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ భూషణం, విశాఖ ఇంటిలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటరావు, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్, ఒంగోలు పీటీసీ ఇన్‌స్పెక్టర్ మోయిన్, అనంతపురం ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్, సభ్యులుగా ఉన్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిట్ బృందాన్ని డీజీపీ ఆదేశించారు. సంబంధిత నివేదికని రెండు రోజుల్లో ఈసీకి పంపిస్తామని సిట్ బృందం తెలిపింది.
పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసను సిట్ సమీక్షించనుంది. కేసు విచారణ సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నిర్వహించిన దర్యాప్తు తీరుని సిట్ స్వయంగా పర్యవేక్షిస్తుంది. అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించి ఐఓకు సిఫారసు చేస్తుంది. అవసరమైతే ప్రతి కేసులోనూ జోక్యం చేసుకుంటుంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి కొత్తగా ఎఫ్ఐఆర్ చేసేలా సిఫారసు చేస్తుంది. విచారణకు సంబంధించి ఇంకా అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.
హింసాకాండకు సహకరించిన కోవర్టు ఖాకీలపై చర్యలేవి సార్? - Election Violence In Ap