Singapore University Professor Meet IT Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో మెరుగైన విద్యా ప్రమాణాలు, ర్యాంకింగ్స్, మెరుగుదల, సంస్కరణల అమలుకు తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రొఫెసర్ చౌదరి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో స్ట్రాటజిక్ ఇండియా అండ్ ఇనిషియేటివ్స్ విభాగానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు.
ఏపీలో ర్యాంకింగ్స్ తగ్గుదల కారణలపై చర్చ : రాష్ట్రంలో యూనివర్సిటీల పనితీరు, మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్ చౌదరి లోకేశ్‌తో చర్చించారు. రీసెర్చ్, ఇన్నొవేషన్స్లో వెనుకబడి ఉండటమే ఏపీలో ర్యాంకింగ్స్ తగ్గుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. వీటిని మెరుగుదల చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రొఫెసర్ అన్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ను తీసుకురావడానికి అవసరమైన పాఠ్యాంశాల మార్పులు, ఇతర విధానాలను ఏపీ వర్సిటీలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రొఫెసర్ చౌదరి తెలిపారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యూనివర్సిటీలకు మంచి గుర్తింపు లభిస్తుందని చౌదరి పేర్కొన్నారు.
The Government of Andhra Pradesh, led by the Hon'ble Chief Minister Shri @ncbn Garu, is committed to upgrading higher education in the state to meet international standards.
— Lokesh Nara (@naralokesh) August 13, 2024
Today, I met with Prof. BVR Chaudhary from the National University of Singapore (NUS). We deliberated… pic.twitter.com/Q544LvP9jP
'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census
విద్యార్థులు తమ సింగపూర్ యానివర్సిటీని సందర్శించండి : రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యా రంగ నిపుణులు, విద్యార్థులు తమ యానివర్సిటీని సందర్శించి సింగపూర్‌లో అవలంభిస్తున్న పద్ధతులను ఆధ్యయనం చేయాలని ప్రొఫెసర్ చౌదరి కోరారు. ఆయన చెప్పిన విషయాలపై మంత్రి లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో యానివర్సిటీ ర్యాంకింగ్ మెరుగుదలకు యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు.
సచివాలయంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్, అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన తీరును అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు తగ్గిపోవడంపై కారణాలపై సమీక్షించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేశ్ వివరించారు.
ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి: లోకేశ్ - Nara Lokesh on SALT Project