ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌ - SIB Praneeth Rao Case Updates - SIB PRANEETH RAO CASE UPDATES

SIB Ex DSP Praneeth Rao Case Updates : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎస్​ఐబీలో ఆధారాల ధ్వసం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరు అధికారులకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. నిందితుడు ప్రణీత్​రావు వాంగ్మూలం మేరకు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన పోలీసులు, న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. మరోవైపు కస్టడీ ముగిసిన ప్రణీత్​రావును సైతం జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్‌ పొడగించలేదు. ఎస్​ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌ రావులపై లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.

SIB PRANEETH RAO CASE UPDATES
SIB Ex DSP Praneeth Rao Case Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 8:09 PM IST

Updated : Mar 25, 2024, 7:07 PM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరికి రిమాండ్‌ మరో ముగ్గురిపై లుక్‌ అవుట్‌ నోటీసులు

SIB Ex DSP Praneeth Rao Case Updates : తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు వ్యవహారంలో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారిని శనివారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు, ఎస్​ఐబీలో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన విషయంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్‌రావు ఇచ్చిన వివరాల ఆధారంగా కేసులో మాజీ ఎస్​ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakar rao), మాజీ టాస్క ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ యజమాని శ్రవణ్​ల పేర్లను ఎఫ్ఐఆర్​లో చేర్చారు.

Two Police Officers Arrested In Phone Tapping Case : శుక్రవారం రాత్రి నిఘా విభాగం మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో భుజంగరావు, తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు జరిపిన పోలీసులు, శనివారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలవి 41ఏ – సీఆర్​పీసీ (CRPC) నోటీసులు అందించారు. విచారణ అనంతరం ఇద్దరు ఏఎస్పీలను అరెస్టు చేసినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా కేసు పూర్వాపరాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

లుక్‌ఔట్​ సర్క్యులర్‌ జారీ : మరోవైపు ట్యాపింగ్‌ వ్యవహారంలో నిఘా విభాగం మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌(Sravan) రావులపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్​రావు కస్టడీలో చెప్పిన అధికారుల పేర్లతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోననే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా పూర్తిస్థాయిలో విచారణ చేస్తూ పోలీసులు ముందుకు సాగుతున్నారు. కస్టడీ విచారణలో ప్రణీత్​రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఎస్​ఐబీలో నోడల్ అధికారి కాకుండా ప్రణీత్‌ రావే, 'లా ఆఫ్‌ ఇంటర్సెప్షన్'లా(law Of interception) ఫోన్‌కాల్స్​ను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Phone Tapping Case Updates : సంబంధిత సర్వర్ రూమ్​లోకి కూడా నోడల్ అధికారి కాకుండా ప్రణీత్​రావుకు యాక్సెస్ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇదంతా చీఫ్‌ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో అతన్ని ప్రధాన నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్​లో పేర్లు నమోదు చేసిన అనంతరం ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు(Radha kishan Rao), శ్రవణ్ రావులకు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన ఇద్దరు అదనపు ఎస్పీలను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇతరుల పాత్రతో పాటు ఎస్​ఐబీలో వీరితోపాటు పనిచేసిన ఇతర సిబ్బంది వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రణీత్​రావును కూడా మరోమారు కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

'ఏప్రిల్​ 6వ తేదీ వరకు రిమాండ్​ విధించారు. జడ్జి మా వాదనలు విని పీపీ వాదనలు కన్ఫర్మ్​ చేశారు. ఏ1 పోలీస్​ కస్టడీ ఎక్సటెన్షన్​ లేదు.'-రాజేందర్, నిందితుల తరపు న్యాయవాది

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు - ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌ - TS PHONE TAPPING CASE UPDATE

ప్రణీత్ రావు వ్యవహరంలో వెలుగులోకి కీలకాంశాలు - కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల ఆచూకీ గుర్తించిన పోలీసులు - DSP Praneeth Rao Case updated

Last Updated : Mar 25, 2024, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.