Show cause Notices Issued to Sandhya Theater: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగిన ఘటన నేపథ్యంలో లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
బాలుడిని పరామర్శించిన సీపీ సీవీ ఆనంద్ : కిమ్స్ ఆసుపత్రిలో సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని సీపీ సీవీ ఆనంద్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో 13 రోజులుగా బాలుడు చికిత్స పొందుతున్నాడు. బాలుడిని పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన జరిగి రెండు వారాలు అవుతుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వం తరఫున నేను, హెల్త్ సెక్రటరీ వచ్చామని అన్నారు.
రెండు వారాల నుంచి తీవ్రంగా గాయపడిన బాలుడికి చికిత్స కొనసాగుతోందన్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారో డాక్టర్లను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను త్వరలోనే డాక్టర్లు విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ఆరోజు జరిగిన తొక్కిసలాటలో ఆక్సిజన్ అందక బాలుడి మెదడు దెబ్బతిందని వెల్లడించారు. ఈ క్రమంలో రికవరీ కావడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారని తెలిపారు. వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ సాగిస్తున్నారని సీవీ ఆనంద్ తెలియజేశారు.
సినిమా చూసి వెళ్లిపోతే సరిపోయేది - హంగామా వల్లే ఇదంతా: రేవంత్‌రెడ్డి
ఇదీ జరిగింది: ఈనెల 4వ తేదీన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోను చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కుటుంబం సంధ్య థియేటర్‌కు వెళ్లింది. అక్కడకు సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అయితే అక్కడ తొక్కిసలాట జరగడంతో పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అక్కడ ఉన్న అభిమానులను చెదరగొట్టారు.
ఈ సమయంలో అక్కడే ఉన్న రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనాల కాళ్ల మధ్యలో పడిపోయారు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తల్లీకుమారుడులను పోలీసులు సీపీఆర్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో తల్లి మృతి చెందగా కుమారుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని కిమ్స్ ఆసుపత్రికి పంపించారు.
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్
అమరావతిపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు - టీడీపీ ఆగ్రహం