Six Persons Died in a Road Accident on National High Way : కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారిపై పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్, కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు నుంచి వస్తున్న ఐషర్ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అలంకరణ పనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - ముగ్గురు కూలీల మృతి - Three died in Road Accident
ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల్లో ఐదుగురు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. రేపు భూషణం (26), చింత లోవరాజు తండ్రి వీర వెంకట సత్యనారాయణ(32), మాగాపు నాగరాజు, కనకరాజు, ధర్మ మృతి చెందారు. ప్రమాద సమయంలో ఐషర్ వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీలో డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడు ఉన్నాడు. కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. చేపలు పట్టేందుకు వెళ్తూ వీరంతా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.
ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన స్కార్పియో - నలుగురి దుర్మరణం - 4 Died In Accident At Gadwal
కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి : జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. తీవ్రంగా గాయపడి మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ని ఆదేశించారు. తొమ్మిది మంది మత్స్యకారుల్లో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతులకు ప్రభుత్వపరంగా సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో ముగ్గురు మృతి : నెల్లూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. సంగం మండలం దువ్వూరు వద్ద జాతీయ రహదారిపై ఓ పేపర్ వ్యాన్ అకస్మాత్తుగా రోడ్డుపై అడ్డుగా వచ్చిన గేదెలను ఢీకొట్టిడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ శ్రీనివాసులను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. వ్యానులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుకు అడ్డం వచ్చిన రెండు గేదెలు కూడా మృతి చెందాయి. మృతుల్లో నాగరాజు అనే వ్యక్తిది సంగం మండలం ఎస్వీఆర్పురం, డ్రైవర్ శ్రీనివాసులు వేంకటేశ్వరపురం వాసులుగా గుర్తించారు.
మరో ప్రమాదంలో నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై మామిడికాయల లోడుతో వెలుతున్న మినీ లారీ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సతీష్అ క్కడికక్కడే మృతిచెందారు. వాహన క్యాబిన్‌లో ఇరుక్కున్న క్లీనర్‌ను స్థానికులు, పోలీసులు కష్టపడి కాపాడారు. తీవ్రంగా గాయపడిన అతడిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మినిలారీ నుజ్జునుజ్జు అవగా, మామిడికాయలు రోడ్డుపై చెల్లాచెదురుగాపడ్డాయి.
నెత్తురోడిన రహదారులు- 11మంది దుర్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి - Road Accidents in AP