ETV Bharat / state

సాషాకు సీమంతం - తరలివచ్చిన బంధుగణం - SEEMANTHAM TO CAT

ఖమ్మం జిల్లాలో పిల్లికి సీమంతం - వేడుకకు వచ్చిన బంధుమిత్రులు

seemantham_to_cat
seemantham_to_cat (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 4:57 PM IST

Seemantham Celebration To Pet Cat In Khammam in District: మహిళకు సీమంతం జరిగే ఆ సమయంలో ఆమెకు చాలా ఆనందంగా ఉంటుంది. స్త్రీ మాతృత్వపు మాధుర్యాన్ని పొందే కొన్ని నెలల ముందు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వదిస్తే ఆమెకు వచ్చే ఆ ఆనందమే వేరు. అదే విధంగా ఖమ్మం జిల్లాలో ఓ ఇంట్లో సీమంతం ఘనంగా జరిగింది. దీంట్లో వింతేముంది అని అనుకోకండి. సీమంతం చేసింది ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు. ఈ సీమంతం చేసింది మహిళకు కాదు పిల్లకి. పిల్లికి సీమంతం చేటడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ఖమ్మం జిల్లాలో ఓ కుటుంబం తమ ఇంట్లో పెంచుకునే పెంపుడు పిల్లికి సీమంతం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

సాంప్రదాయంగా సీమంతం: ఖమ్మం జిల్లాలో మధిర సీపీఎస్​ రోడ్​లోని అల్లూరి నాగభూషణం, పద్మావతి అనే దంపతులు ఒక పిల్లిని పెంచుకుంటున్నారు. ఆ పిల్లికి సాషా అని పేరు కూడా పెట్టారు. అయితే ఆ పిల్లి కడుపుతో ఉంది. ఈ క్రమంలో దాని మీద వారికి ఉన్న ప్రేమతో దానికి సీమంతం వేడుక జరిపించి దానిపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన బంధుమిత్రులు పిల్లిని అందంగా తయారు చేసి, గాజులు తొడిగి, బొట్లు పెట్టి సాంప్రదాయంగా సీమంతం జరిపించారు. ఇరుగు పొరుగు వారు పండ్లు, ఫలహారాలు ఇచ్చారు. పిల్లికి సీమంతం చేయడం చాలా సంతోషంగా ఉందని దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసిన జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హీరోలు సినిమాల్లో కాదు ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారు: పవన్‌ కల్యాణ్​

తిరుమలలో కడియం కొన్న భక్తుడు- రూంకి వెళ్లి చూసి షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.