Second Vande Bharat Express From Secunderabad to Visakhapatnam : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) నేడు పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, 3 కోచ్ రెస్టారెంట్లు, 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణరకు శ్రీకారం చుట్టారు.
Second Vande Bharat Express in Telugu States : ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఒక్క గురువారం తప్ప మిగిలిన అన్ని రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రెండు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో సేవలందిస్తోంది. దీనికి ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన ఉండడంతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తున్నారు.
ఈ రైలు సాధారణ సేవలు విశాఖపట్నం-సికింద్రాబాద్(Vizag to Secunderabad) వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ల బుకింగ్స్ నేటి నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
వందేభారత్ స్థాయిలో రైలు బోగీలు- పెరగనున్న ఛార్జీలు! జనరల్ కోచ్‌ల పరిస్థితేంటి?
వందేభారత్ రైలు సమయం : రైలు నంబరు 20707 సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 05:05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 20708 విశాఖపట్నం-సికింద్రాబాద్ రైలు మధ్యాహ్నం 14:35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి రాత్రి 23:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లతో ప్రయాణిస్తుంది. అన్ని కోచ్‌లలో కలిపి 530 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది.
Kishan Reddy Speech on PM Modi : సుమారు రూ.85 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రారంభించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారని కొనియాడారు. చర్లపల్లి టెర్మినల్ 90శాతం పూర్తయిందని మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
"తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టాం. దక్షిణమధ్య రైల్వేలో ప్రస్తుతం 3 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాం. సుమారు రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు." - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
వందేభారత్ స్లీపర్ కోచ్ రెడీ- పరీక్షల తర్వాత పట్టాలపైకి! సౌకర్యాలు అదుర్స్
వందేభారత్‌కు 'కవచ్'- 160 కి.మీ స్పీడ్‌కు బ్రేకులు- ట్రయల్ సక్సెస్