Sarpanches Asks Extend Time Period in Telangana : మళ్లీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్‌లుగా కొనసాగించాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తమను నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము గ్రామాల్లో పని చేసినందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. తమ సర్పంచుల పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుందని ప్రభుత్వం తమ స్థానాలలో స్పెషల్ అధికారులను(Special Employees in Villages) నియమించాలని చూస్తోందని పేర్కొన్నారు.
సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు : సీతక్క
Telangana Sarpanches Issue : గత 30 నెలలుగా తమకు రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఇప్పుడు తమ పదవి పోతే అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆత్మస్థైర్యం కోల్పోయి కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు పదవులు పోతే మరికొంతమంది (Sarpanch Issue) కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Sarpanches Demands in Telangana : ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్ తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వరకు తమ పదవీ కాలం పొడిగించాలని(Sarpanch Time Period) కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించక పోతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేసి అక్కడే నిరాహారదీక్షలు చేపడతామని హెచ్చరించారు.
"గ్రామాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, స్వచ్చందంగా పనులు చేసినా మాపై కక్ష కట్టినట్టు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇప్పటివరకు సుమారుగా 30 నెలలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటి ప్రభుత్వం వచ్చేందుకు సర్పంచ్ల కృషి కూడా ఉంది. మా సమస్యను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వివరించాం. మంత్రి సీతక్కను కూడా కలిశాం. ముఖ్యమంత్రి మా సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం. మాకు మరో ఆరు నెలలు లేదా సంవత్సరం పాలనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞాప్తి చేస్తున్నాం. మా పదవి అయిపోతే అప్పుల వాళ్ల బాధ తట్టుకోలేం. పదవి కాలం పొడిగిస్తే మేము మీ పాలనకు మరింత సహకరిస్తాం."- శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Ideal Village Mariyapuram : సర్పంచ్ కృషితో ఊరంతా పచ్చదనం.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న 'మరియాపురం'