ETV Bharat / state

సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం - ఎక్కడుంటే అక్కడే వివరాలు చెప్పొచ్చు! - SAMAGRA KUTUMBA SURVEY

నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాల సర్వే ప్రారంభం

SAMAGRA_KUTUMBA_SURVEY
SAMAGRA_KUTUMBA_SURVEY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2024, 10:53 AM IST

Samagra Kutumba Survey In Telangana Begins Today : తెలంగాణ రాష్ట్రంలో రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను గణకులు(enumerators) సేకరిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి రేవంత్​ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే ఎన్యూమరేటర్లు వద్ద తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డులో చిరునామా ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ వద్దని తెలంగాణ ప్రణాళికశాఖ సూచించింది. కుటుంబ సభ్యుల వ్యక్తి గత ఆధార్, మొబైల్​ ఫోన్​ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలియజేయాలి. ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్​ వంటివి అందుబాటులో ఉంచుకుంటే సర్వే కోసం వచ్చిన ఎన్యూమరేటర్లుకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.

9 నుంచి సమగ్ర కుటుంబ సర్వే - అవి సిద్ధంగా ఉంచుకోండి

ఇంటి నంబరు, యజమాని పేర్ల నమోదు పూర్తి : ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు సర్వే ఈ నెల 6 నుంచి 8 వరకు (nov 6 to 8) పూర్తి చేశారు. ఒక్కో ఎన్యూమరేటర్​కి 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించడంతో వీటి నంబర్ల నమోదుకు బుధ, గురు, శుక్రవారాల వరకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఇంకా పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొన్ని ఇళ్లు మిగిలాయి. వాటి వివరాల నమోదు శనివారం పూర్తి చేస్తారు. వీటి ఆధారంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులు అందరి సమగ్ర వివరాల నమోదును ఈ నెల 9 (శనివారం) నుంచి నెల ఆఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రేవంత్​ ప్రభుత్వం నిర్దేశించింది. అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయి. అన్ని ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రణాళిక శాఖ అధికారులు తెలిపారు. ఒక్కొ గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 28,32,490 కుటుంబాలు ఉండటంతో 19,328 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేయడానికి 94,750 మంది ఎన్యూమరేటర్లు, వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను ప్రభుత్వం నియమించింది.

'సమగ్ర కుటుంబ సర్వే' - వారికి ఆ సమాచారం ఇస్తే డేంజర్​లో పడ్డట్టే!

ఏ కులమూ లేదంటే 999 కోడ్‌ : రేవంత్​ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కుటుంబాల వివరాల నమోదు కోసం ఇది వరకు ఖరారు చేసిన ఫాంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. కులం వివరాలు చెప్పకుంటే 999 కోడ్​ను, ఏ సామాజిక వర్గం లేదు అంటే 01 కోడ్‌లతో నమోదు చేసేలా మార్పులు చేర్పులు చేశారు. ధరణిలోని భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కొన్ని వరుసలను అదనంగా చేర్చారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు ఎలాంటి వివక్ష, బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా వెళుతున్నారా? లేదా అనే అంశాన్ని సైతం కొత్తగా జోడించినట్లు అధికారులు తెలిపారు.

రాజ్‌భవన్‌ వద్ద సర్వే స్టిక్కర్‌ : సమగ్ర సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌ కుటుంబ వివరాల నమోదు కోసం రాజ్‌భవన్‌ గేటు వద్ద ఎన్యూమరేటర్లు శుక్రవారం స్టిక్కర్‌ అతికించారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పేరుతో స్టిక్కర్‌ అతికించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఆ పత్రాలన్నీ రెడీ చేసుకోండి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.