ETV Bharat / state

ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణా రెడ్డి రాజీనామా - AP Government Advisor

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 7:44 PM IST

AP Government Advisor: ఏపీలో 20 మందికి పైగా ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను సీఎస్‌కు పంపించారు. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోవడంతో పలువురు సలహాదారుల రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, జాతీయ మీడియా సలహాదారు అమర్, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

AP Government Advisor
AP Government Advisor (ETV Bharat)

AP Government Advisor Sajjala: ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) రాజీనామా చేసారు. వైఎస్సార్సీపీకి అధికారం పోవటంతో సలహాదారులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. 20 మందికి పైగా సలహాదారులు సీఎస్ కు రాజీనామాలు పంపారు. ఇప్పటికే జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు రాజీనామా లేఖల్ని సీఎస్ కు పంపారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా లేఖను ఈవోకి పంపారు.

ఇక తనను రిలీవ్ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మావిజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తు చేసారు. టి.విజయ్ కుమార్ రెడ్డి ఎన్నికల ఫలితాలకు ముందు పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసారు. కూటమి విజయం సాధించటంతో పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనను వెనక్కు తీసుకుని రిలీవ్ చేయాలని విజయ్ కుమార్ రెడ్డి సీఎస్ కు దరఖాస్తు చేసారు.

ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శలు - సీఐడీ ఏడీజీ సంజయ్ సెలవు రద్దు - Government Cancelled CID Chief Sanjay Leave

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.