SAEL Delegates Meet CM Chandra Babu and Nara Lokesh : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో SAEL, నార్ఫండ్, NDB బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ఎనర్జీ పాలసీ, పరిశ్రమల స్థాపనపై చర్చించారు. చెత్త నుంచి విద్యుతుత్పత్తికి తమ సాంకేతికతను SAEL సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వ్యవసాయ వ్యర్థాలతో రైతుల ఆదాయం పెంచే ప్రాజెక్టుల అభివృద్ధికి పూర్తి సహకారం అందించేలా చర్చలు సాగాయని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి ఎస్‌ఏఈఎల్(SAEL) అనుసరిస్తోన్న సాంకేతిక విధానాన్ని వివరించిందని చెప్పారు. అన్నదాతలకు లాభం చేకుర్చే ఈ తరహా ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడానికి పూర్తి సహకారం ఉంటుందన్నారు.
భేటీపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో SAEL రెండు దశల్లో 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి పెట్టుబడులు పెట్టనుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మొదటి దశలో 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనుందని వివరించారు. అలాగే నార్ఫండ్, ఎన్డీబీ బ్యాంకు, సోక్జీన్ ఇండియా ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణం పై చర్చించామని లోకేశ్ తెలిపారు.
It was a pleasure to meet representatives of SAEL Ltd., and leading financial institutions in renewable energy @norfund, @NDBBank and Societe generale ( @SocGen_India ) to discuss investments under AP's landmark Integrated Clean Energy (ICE) Policy. We welcome investors to… pic.twitter.com/untMIZqUwn
— N Chandrababu Naidu (@ncbn) December 14, 2024
I met Mr. Sukhbir Singh, Managing Director, SAEL Industries Ltd. to discuss SAEL's upcoming 1200 MW investment in Andhra Pradesh to be developed in two phases. They will be commencing work on the first phase 600 MW project, one of the first projects to commence construction under… pic.twitter.com/doZP5BJBfF
— Lokesh Nara (@naralokesh) December 14, 2024
భవిష్యత్ ఇంధనంపై ఏపీ ప్రభుత్వం దృష్టి - ఆర్ఈజెడ్‌ల ఏర్పాటుకు నిర్ణయం
విద్యుత్‌ను దాచుకుందాం- అవసరమైనప్పుడు వాడుకుందాం! ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం