ETV Bharat / state

గుంతల రోడ్లు - కాలం చెల్లిన బస్సులు - ఆర్టీసీ సిబ్బందికి ఇక్కట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 3:41 PM IST

RTC Workers Problems In Andhra Pradesh : డొక్కు బస్సులతో వేగలేకపోతున్నాం అని ఎంత మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియామకాలు చేపట్టాలని, కొత్త బస్సులు కావాలని అడుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.

rtc_workers_problems_in_andhra_pradesh
rtc_workers_problems_in_andhra_pradesh

RTC Workers Problems In Andhra Pradesh : అసలే డొక్కు బస్సులు, ఆపై గుంతల రోడ్లు, ప్రమాదం జరిగితే కఠినమైన శిక్షలు, విరివిగా సౌకర్యాల కోతలు, నియామకాల వాయిదాలు ఇవీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ డ్రైవర్ల దీన పరిస్థితులు. బ్రేకులు ఫెయిల్​ అయ్యి కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, అదుపు తప్పి గుడిసెను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, బస్​స్టాండ్​లో ప్రయాణికుల మీదికి దూసుకెళ్లిన బస్సు ఇలా ఎక్కడ చూసినా ఆర్టీసీ అవస్థలు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నా పట్టించుకే నాథుడే లేడని ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.

RTC Workers Protest in Vijayawada : ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థానంలో తక్షణమే భర్తీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రిటైర్డ్ అయిన వారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల బకాయిలన్నీ తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టంతో రవాణా రంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాబోయే బడ్జెట్లో నూతన బస్సులు కొనేందుకు ఆర్టీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్‌ - 53 శాతం కాలం చెల్లిన బస్సులే?

Old RTC Buses : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గతంలో ఏపీపీటీడీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రకాశం జిల్లా ఒంగోలు డిపోలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించినా బస్సులకు, డ్రైవర్లకు విరామం లేకుండా పోతుంది. తుక్కుకు వేయాల్సిన వాహనాలను సైతం రోడ్డెక్కిస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైపై మెరుగులద్ది డిపోలకే పరిమితం కావాల్సిన బస్సులకు ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాలం చెల్లిన బస్సులతో కాసులు దండుకుంటున్నారు. రాబడిలో వాటాలు, వసూళ్లు, ఛార్జీల పెంపు తప్ప సామాన్య ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించిన దాఖలాలే కనబడటం లేదంటున్నారు బాధితులు. కనీసం బస్సులకు మరమ్మతులు చేయడానికి అవసరమైన సామాగ్రి సైతం అందించడంలేదని, బస్సు మరమ్మతులకు కూడా డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.

ఓ వైపు గుంతల రోడ్లు మరోవైపు కాలం చెల్లిన బస్సులు- ఆంధ్రా ఆర్టీసీ ఇక్కట్లు

బస్సు మరమ్మతులకు డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు ఆపాలి - ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

RTC Bus Accidents in AP : ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి కథనానికి ఆర్టీసీ బస్సు బీభత్సం - గుడిసె మీదకు దూసుకెళ్లిన వైనంపై క్లిక్​ చేయండి.

గతుకుల రోడ్డు ప్రయాణం ఆపై ఫిట్​నెస్ అంతంతే - పంటకాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడ్డ బస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.