ETV Bharat / state

ఎట్టకేలకు దిగొచ్చిన ఆర్టీసీ- చిలకలూరిపేట సభకు బస్సులు పంపేందుకు ఓకే - RTC Authorities Provide Buses

RTC Authorities Said Will Provide Buses to Chilakaluripet Meeting: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల సభలకు ఆర్టీసీ బస్సులను ఇవ్వని యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న కూటమి పార్టీల సభకు ఆర్టీసీ బస్సులను ఇచ్చేందుకు అధికారులు సమ్మతించారు. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి బహిరంగ సభకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

RTC Authorities Said Will Provide Buses
RTC Authorities Said Will Provide Buses
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 12:58 PM IST

RTC Authorities Said Will Provide Buses to Chilakaluripet Meeting: ప్రతిపక్షాల సభలకు ఇంత కాలం ఒక్క బస్సు కూడా ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికారులు ఇప్పుడు టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న భారీ సభకు బస్సులు ఇస్తామంటూ ముందుకొచ్చారు. ఎన్ని బస్సులు కావాలో చెప్పాలంటూ కబురు పంపారు. ఇంతకాలం వైసీపీ కబంధ హస్తాల మధ్య నలిగిన ఆర్టీసీ యంత్రాగం ఇక ఊపిరి పీల్చుకోనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టీడీపీ అధిష్ఠానం ఏ సభలు నిర్వహించినా బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ససేమిరా అంటూ ఉండేది. పూర్తి సొమ్ము ముందే చెల్లిస్తామని చెప్పినా, డిపో మేనేజర్లను కలిసినా మొండికేస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో టీడీపీ నేతల నుంచి డబ్బు తీసుకుని, తరువాత బస్సులు ఇవ్వబోమంటూ ఆ సొమ్ము వెనక్కి ఇచ్చిన ఘటనలు ఉన్నాయి.

17న చిలకలూరిపేటలో 3 పార్టీల తొలి బహిరంగ సభ - పాల్గొననున్న ప్రధాని మోదీ

చిలకలూరిపేటలో ఈ నెల 17న భారీ బహిరంగ సభను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ సభకు కూటమి శ్రేణులు తరలి వచ్చేందుకు వీలుగా బస్సులు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు తోడు భవిష్యత్ ఎలా ఉండబోతుందో అర్థమైన అధికారులు బస్సులు ఇచ్చేందుకు సమాయత్తమయ్యారు. ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇవ్వాలని కోరారు.

ఎట్టకేలకు దిగొచ్చిన ఆర్టీసీ- చిలకలూరిపేట సభకు బస్సులు పంపేందుకు ఓకే

కూటమిని ఆశీర్వదించండి - సీట్ల సంఖ్య కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: చంద్రబాబు, పవన్‌

చిలకలూరిపేటలో జరగనున్న ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. పెద్ద పార్టీగా టీడీపీ ఎక్కువ బాధ్యత తీసుకుని విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందించింది. బహిరంగ సభల నిర్వహణ అనేది టీడీపీకి కొత్తేమీ కాదు. దివంగత ఎన్టీఆర్ నుంచి పదుల సంఖ్యలో బహిరంగ సభలను టీడీపీ విజయవంతం చేసింది. చిలకలూరిపేట సభను వాటి సరసన నిలిచేలా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 లక్షల నుంచి 6 లక్షల మంది తరలి వచ్చేలా కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కూటమి ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. వైసీపీ సిద్ధం సభలకు మించి ప్రజలు దీనికి హాజరవుతారని టీడీపీ, మిత్రపక్షాల నేతలు అంచనా వేస్తున్నాయి.

కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.