RP Sisodia On Boat Rescue Operations At Krishnapatnam Port : ఇంజన్ విఫలమై కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో నిలిచిపోయిన బోటును అధికారులు సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చారు. తిరుపతికి 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలో నిలిచిపోయిన బోటును సురక్షితంగా వెనక్కు తీసుకురాగలిగామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. ఉదయం నుంచి యుద్ద ప్రాతిపదికన చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. 9 మంది మత్స్య కారులను కాపాడి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని సిసోడియా వివరించారు.
బోటులో చిక్కుకుపోయిన మత్స్యకారులు : ఈరోజు ఉదయం బోటు సముద్రంలో నిలిచిపోయిన విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డ్, కృష్ణపట్నం ఓడరేవు అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో విపత్తుల నిర్వహణ శాఖ చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా వెంటనే రంగంలోకి దిగి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కృష్ణపట్నం మెరైన్ హెడ్ కెప్టెన్ రజత్ తో మాట్లాడారు. చిక్కుకుపోయిన మత్స్యకారులను రక్షించేందుకు, ఓడరేవు ప్రాంతం నుంచి లోపలకు వెళ్లేందుకు డీజీ షిప్పింగ్ అనుమతి ఆవశ్యకతను మెరైన్ హెడ్ కెప్టెన్ జిల్లా కలెక్టర్, సిసోడియాకు వివరించారు. అనంతరం డీజీ షిప్పింగ్ తో మాట్లాడిన సిసోడియా అవసరమైన అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు.
గోదావరిలో పడవ పోటీలు - పందెం గెలిస్తేనే మనుగడ!
తుపాను కారణంగా వాతావరణం సహకరించకపోయినా ఎంతో శ్రమించి అధికారులు, సిబ్బంది ఎట్టకేలకు విజయవంతంగా తాడును పడవతో అనుసంధానించి ఒడ్డుకు చేర్చగలిగారు. సచివాలయం నుంచి విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటు జిల్లా కలెక్టర్ సంయుక్త కృషి ఫలితంగా 9 మంది ప్రాణాలను కాపాడగలిగినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
జనం మెచ్చే జలమార్గం : పర్ణశాలకు వెళ్లేందుకు పడవ ప్రయాణం కల్పించరూ!
పర్యాటకులతో వెళ్తున్న బోటులోకి నీరు - పాపికొండల విహార యాత్రలో తప్పిన పెను ప్రమాదం