RP Sisodia Inquiry Into Govt Land Grabs in Visakha: వైఎస్సార్సీపీ హయాంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందనే ఆరోపణల వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా విశాఖలో పర్యటించారు. ముందుగా మధురవాడ ప్రాంతంలోని హయగ్రీవ, రామానాయుడు స్టూడియో భూములను సిసోదియా పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీఓలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కట్టడాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత దసపల్లా భూములను పరిశీలిచంచారు. అనంతరం ఆనందపురం, భీమిలి మండలాల్లో అన్యాక్రాంతమైన భూములను సిసోదియా పరిశీలించారు.
విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ ఎర్రమట్టి దిబ్బలలో భీమునిపట్నం మ్యూచువల్ లిమిటెట్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి, శారదా పీఠానికి కేటాయించిన భూములను కలెక్టర్ హరిప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌లతో సిసోదియా పరిశీలించారు. అనంతరం భీమునిపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో 22-ఏ భూముల రికార్డులను, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఎం. గోపిచంద్‌ని అడిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలను తెలుసుకున్నారు. తర్వాత వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలకు సంబంధించి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. విశాఖ నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సిసోదియా సమీక్ష నిర్వహించారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆళ్ల నాని - Alla Nani Resign to YSRCP
విశాఖలోని దసపల్లా, హయగ్రీవ, శారదాపీఠం, రామానాయుడు స్టూడియో భూములను పరిశీలించాం. 22ఏ నుంచి తొలగించిన, ఉన్న భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. 3 నెలలుగా 22ఏ నుంచి భూముల ఉపసంహరణ జరగలేదు. హయగ్రీవ భూముల్లో న్యాయపరమైన అంశాలున్నాయి. ఎర్రమట్టి దిబ్బల్లోని 7 నీటి మార్గాల్లో రెండు మూసుకుపోయాయి. దసపల్లా భూములపై సరైన వేళలో అప్పీల్‌కు వెళ్లక ఇబ్బంది వచ్చింది. విశాఖలో భూముల మ్యాపింగ్‌పై ప్రత్యేక సూచనలు ఇచ్చాము. ప్రభుత్వ భూమి, గెడ్డలు, పార్కులకు కలర్ కోడింగ్ ఇవ్వాలని సూచించాను. రెవెన్యూ సదస్సుల ద్వారా భూవివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం. సదస్సుల తర్వాత రాజముద్రతో కూడిన పాస్‌బుక్‌లు ఇస్తాము. విశాఖ భూములపై వేసిన సిట్ నివేదిక బహిర్గతం చేయాలని చెప్పడం జరిగింది.- సిసోదియా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు - మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు జోగి రమేశ్ - Jogi Ramesh to Mangalagiri PS