ETV Bharat / state

పడేయాల్సిన చికెన్ భాగాలు ప్లేట్​లోకి! - హోటళ్లు, రెస్టారెంట్లకు విక్రయం - పాతబస్తీ కేంద్రంగా గలీజ్ దందా - CHICKEN SALES IN HYDERABAD

పాతబస్తీ కేంద్రంగా కోడి మాంసం వ్యర్థాల విక్రయం

Rotten Meat Sales in Hyderabad
Rotten Meat Sales in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 3:40 PM IST

Rotten Meat Sales in Hyderabad : చాలా మందికి నాన్​వెజ్ అంటే చాలా ఇష్టం. ఆ పేరు చెప్పగానే మాంసాహార ప్రియుల నోట్లో నీళ్లు ఊరుతాయి. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు ముద్ద దిగాలంటే ముక్క ఉండాల్సిందే. మరి మీరు కొనే మాంసం ఎక్కడి నుంచి వచ్చిందో అని ఎప్పుడైనా ఆరా తీశారా? అవన్నీ మనకెందుకు గురూ షాప్​కి వెళ్లి తెచ్చుకుంటాం అంటారా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి కూడా కాస్తా ఆలోచించండి. ఎందుకంటే కొన్ని ముఠాలు నాసిరకం, కుళ్లిన మాంసాన్ని సరఫరా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్​ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

కోడి మాంసం దుకాణాల్లో కోళ్ల మెడ, కాళ్లు, రెక్కలకొనలు, ఇతర శరీర భాగాలను చెత్తగా పడేస్తుంటారు. అలాంటి వ్యర్థాలన్నింటినీ సేకరించి కోడి మాంసం అంటూ విక్రయిస్తున్న ముఠాలు హైదరాబాద్​లో పెరుగుతున్నాయి. పాతబస్తీ కేంద్రంగా కుళ్లిన మాంసాన్ని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న రెండు సంస్థలను జీహెచ్‌ఎంసీ తాజాగా నిర్ధారించింది. ఆయా కేంద్రాలు నగరంలోని అన్ని మూలలకూ నాసిరకం, కుళ్లిన మాంసాన్ని సరఫరా చేస్తున్నాయని తేలింది. వారి దగ్గర మాంసం కొని జనావాసాల్లో గోదాములను ఏర్పాటు చేసుకుని పలు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు విక్రయిస్తున్న కేంద్రాలను సీజ్‌ చేయడంతో ఈ తతంగం బయటకి వచ్చింది.

కుళ్లిన మాంసంతో : కోడి మాంసాన్ని కొందరు చర్మంతో తీసుకుంటారు. మరికొందరు చర్మంలేని ముక్కలను కొంటారు. చెస్ట్‌పీస్, వింగ్స్‌, లెగ్‌పీస్ ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు సైతం కోడి, మేక, పొట్టేలు మాంసాన్ని గ్రాముల లెక్కన విక్రయిస్తుంటాయి. అలా మాంస వ్యర్థాలు పెద్దఎత్తున పోగయితే వాటిని పాతబస్తీలో గోదాములను ఏర్పాటు చేసుకుని హోల్‌సేల్‌ ధరలతో అమ్ముతున్నారు. మరికొన్ని పౌల్ట్రీ సంస్థలు కర్రీ కట్‌ పేరుతో చిన్న ముక్కలను తయారు చేసి చిన్నపాటి సంచుల్లో ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. కోళ్ల పెంపకం కేంద్రాల్లో కళేబరాలను కొందరు ముక్కలుగా చేసి, మార్కెట్లో అమ్ముతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అలాంటి కళేబరాలను రెండు రోజులయ్యాక ముక్కలు చేసి, హోల్‌సేల్‌ మార్కెట్లో అమ్ముతున్న దళారులు కూడా నగరంలో ఉన్నారు.

బేగంపేటలో రెండోసారి : బేగంపేటలోని ఓ బస్తీ నుంచి స్థానిక కార్పొరేటర్‌ ద్వారా జీహెచ్‌ఎంసీకి ఓ కోడిమాంసం విక్రయ కేంద్రంపై ఫిర్యాదులు అందాయి. వెంటనే పశువైద్య విభాగం, ఆహార కల్తీ నియంత్రణ విభాగాల అధికారులు సోదాలు చేపట్టారు. బెంగళూరు, చెన్నై నుంచి నగరానికి వస్తున్న మాంసాన్ని హోల్‌సేల్‌లో కొని జనావాసాల్లోని ఓ ఫ్లాట్​ను అద్దెకు తీసుకుని అందులో నిల్వ చేస్తున్న వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ కేంద్రాన్ని మూసివేయించారు.

ఈ ఘటన జరిగిన రెండు నెలలకే బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో మరోకటి వెలుగులోకి వచ్చింది. కుళ్లిన కోడిమాంసం విక్రయ కేంద్రంపై దాడులు నిర్వహించిన అధికారులు 700 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కంటోన్మెంట్‌లో ఇలాంటి ఓ కేంద్రాన్ని మూసివేశారు.

నెల్లూరులో మాంసం విక్రయాలపై అధికారుల దాడులు.. 400 కేజీల మాంసం సీజ్

మాంసం మోసం, రోజుల తరబడి నిల్వ ఉన్న సరకును అంటగట్టి ఆరోగ్యంతో చెలగాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.