ETV Bharat / state

ఆర్కే రోజా ఘోర పరాజయం - జబర్దస్త్‌ ఓటమిని రుచిచూపించిన నగరి ప్రజలు - Roja lost in Nagari constituency

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 9:53 PM IST

Roja Lost in Nagari Constituency for AP Assembly Elections 2024 : హ్యాట్రిక్‌ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్‌ ఓటమిని రుచిచూపించారు. గడచిన ఐదేళ్లలో ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా, మంత్రిగా పదవులు వెలగబెట్టినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో ఎన్నికల వేళ ఓటర్లు తమ ప్రతాపం చూపారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌ చేతిలో 43,505 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడారు.

Roja Lost in Nagari Constituency for AP Assembly Elections 2024
Roja Lost in Nagari Constituency for AP Assembly Elections 2024 (ETV Bharat)

Roja Lost in Nagari Constituency for AP Assembly Elections 2024 : హ్యట్రిక్‌ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు గుణపాఠం చెప్పారు. చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో 2014, 19 ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో నెగ్గిన రోజా ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్ర పారిశ్రామిక మండలి (APIIC) ఛైర్‌పర్సన్‌, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా పదవులు వెలగపెట్టినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమి లేకపోవడంతో ఎన్నికల వేళ తమ ప్రతాపం చూపారు. కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు ఆర్కే రోజా ఓటమి అదే రీతిలో సాగింది.

మాచర్లలో ఆటవిక పాలనకు తెర- పిన్నెల్లి ఓటమితో ప్రజలకు స్వాతంత్య్రం! - Pinnelli defeat in Macherla

అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీ నేతలపై నోరేసుకుని పడిపోయే మంత్రి ఆర్కే రోజాను నగరి ప్రజలు నోరు మూయించారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి APIIC ఛైర్మన్‌గా, మంత్రిగా అడ్డగోలుగా దోచిన తీరుపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఏ మండల పరిధిలో రోజాకు మద్దతు లభించలేదు. నగరి నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన రోజా నగరిలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను పక్కన పెట్టేశారు. నియోజకవర్గాన్ని తమ కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేసి భూ ఆక్రమణలు, ఇసుక అక్రమ రవాణా సహా దోపిడీ పర్వాన్ని కొనసాగించారు.

కడపలో ఐదు స్థానాల్లో టీడీపీ గెలుపు- జగన్​కు గతంలో కంటే తగ్గిన 28 వేల ఓట్ల మెజారిటీ - Kadapa Election Results 2024

పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ కొమ్ముకాసిన ఐదు మండలాల ప్రముఖ నేతలను రోజా బేఖాతరు చేశారు. వడమాలపేట ZPTC సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరుకు చెందిన మాజీ MPP వేలుమలై, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ కె.శాంతి, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కే.జె.కుమార్, శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు ఇలా మండల స్థాయి నేతలను దూరం పెట్టారు. మంత్రి రోజా సోదరులు కుమార్ స్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, భర్త సెల్వమణిలకు పెత్తనం కట్టబెట్టారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే రోజా ఓటమికి తీవ్రంగా కృషి చేశారు.

ముఖ్యనేతలను పక్కనపెట్టడంతో పాటు విజయపురం, వడమాల పేట మండలాల్లో మట్టి అక్రమ తరలింపు, నియోజకవర్గంలో అధికారుల బదిలీల్లో రోజా చేతివాటం ప్రదర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు APIIC ఛైర్మన్ పదవి అలంకరించిన రోజా వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం భూముల్లో పారిశ్రామిక వాడ కోసం భూములు సేకరించారు. భూసేకరణలో రోజా కోట్ల రూపాయలు వెనకేసుకొన్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. రెండున్నరేళ్లు మంత్రిగా ఆధికారం చెలాయించినా నియోజకవర్గంలో ఎలాంటి ప్రగతి లేకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటమికి బాటలు వేసింది.

నెల్లూరులోనూ కూటమి ప్రభంజనం - సంబరాల్లో కార్యకర్తలు - AP Election Result 2024

ఆర్కే రోజా ఘోర పరాజయం - జబర్దస్త్‌ ఓటమి రుచిచూపించిన నగరి ప్రజలు (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.