Robbery in Bapatla District: బాపట్ల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ బంగారు నగల వ్యాపారిని దారిలో అడ్డగించి రూ.39.50 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కొరిశపాడు మండలం పిచ్చికల గడిపాడు దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన వ్యాపారి స్వరూప్ నగల కొనుగోలు కోసం గుంటూరు నుంచి చెన్నై బయల్దేరాడు. గుంటూరు నుంచి వెంకటరమణ గూడ్స్ ట్రావెల్స్ లారీలో చెన్నై వెళ్తున్నాడు. ఈలోగా పిచ్చికల గడిపాడు దగ్గర దుండగులు వ్యాపారి ప్రయాణిస్తున్న లారీని అడ్డుకున్నారు. స్వరూప్ దగ్గర ఉన్న రూ.39.50 లక్షలు లాక్కొని పరారయ్యారు. అయితే ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగగా వ్యాపారి ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఘటన వెలుగు చూసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నగరంపై ధార్ గ్యాంగ్ కన్ను - దోపిడీకి ముందు వీళ్లు ఏం చేస్తారంటే!