Road Accident at Raidurgam in Hyderabad : కొడారి సత్యనారాయణ, అతని సోదరుడు కాంతారావు రెండు రోజుల క్రితం మార్నింగ్ వాక్ ముగించుకుుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. సిగ్నల్ దగ్గర రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వారు గాల్లోకి ఎగిరి కారుపై పడ్డారు. ఘటనలో సత్యనారాయణ కుడికాలు నుజ్జు నుజ్జు అయ్యి పక్కటెముకలు విరిగాయి. కాంతారావుకు తలకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
48 గంటలు గడిస్తే కానీ ఇద్దరి విషయంలో ఎలాంటి సమాచారం చెప్పలేమని వైద్యులు తెలిపారు. తప్పతాగి యువకులు చేసిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తొలుత ఓ బైకును ఢీకొనగా కారులో ఉన్న యువతీ యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కాంతారావు, సత్యనారాయణలకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి కరీంనగర్ చెందిన కొల్లా సుధీర్ రెడ్డిగా గుర్తించారు. తన బంధువుల కుమార్తె అమెరికా నుంచి వస్తుండగా ఆమెను విమానాశ్రయం నుంచి తీసుకొచ్చేందుకు సుధీర్ రెడ్డి తన కారులో వెళ్లాడు.
రెడ్ సిగ్నల్ ఉన్నా ఆగకుండా ఢీకొట్టారు : అదే సమయంలో మణికొండలో తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించిన సుధీర్, కారులో రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టారు. ఇదే క్రమంలో మెహిఫిల్ రెస్టారెంట్ వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నా ఆగకుండా వీరిని ఢీకొట్టారు. బాధిత బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ఇంటర్ చదువుతుండగా కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. తండ్రిని ఈ పరిస్థితిలో చూసి చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరో వైపు కాంతారావుకు భార్య లేకపోవడంతో ఇద్దరు పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి తమ కుటుంబాల్ని రోడ్డున పడేలా చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి.
'సుధీర్‌రెడ్డి అనే వ్యక్తితో పాటు ఇంకో ఇద్దరు స్నేహితులు కారులో రాయదుర్గం నుంచి మెహదీపట్నం వెళ్తున్నారు. సిగ్నల్ దగ్గర రోడ్డు దాటుతున్న ఓ బైక్‌ను అతివేగంతో వెళ్లి ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరికి కుడికాలు విరిగిపోయింది. ఇంకో వ్యక్తికి తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్లి విచారిస్తే కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించినట్లు నిర్థారణ అయింది'- వెంకన్న, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్
ఇంటికెళ్దాం లే నాన్నా - రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రి పక్కన కుమారుడి రోదన
నారాయణపేట జిల్లాలో బస్సు, ద్విచక్ర వాహనం ఢీ - ఇద్దరి దుర్మరణం