ETV Bharat / state

ముగ్గురి ప్రాణాలను బలిగొన్న గుంత - మహబూబాబాద్​ జిల్లాలో ఘటన - 3 Killed in Auto and Car Collision - 3 KILLED IN AUTO AND CAR COLLISION

Three Killed in Auto and Car Collision : కారు-ఆటో ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Three Killed in Auto and Car Collision
Three Killed in Auto and Car Collision (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 9:53 AM IST

Fatal Road Accident in Mahabubabad District : జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం శివారులోని 563వ వరంగల్​-ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంతో పాటు పోలీసు పెట్రోలింగ్​ వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తొర్రూరు నుంచి ఐదుగురు ప్రయాణికులతో ఆటో డ్రైవర్ మహబూబ్​నగర్​ జిల్లా​ దంతాలపల్లి మండలం బీర్​శెట్టి గూడెం వెళుతున్నారు. శివారులోకి చేరుకున్నాక రోడ్డు మరమ్మతు పనుల నిమిత్తం రోడ్డు మూడు కిలోమీటర్ల మేర తవ్వేసి ఉంది. ఆ రోడ్డులో ప్రయాణిస్తూ గుంతల వద్ద ఆటోను తప్పించేందుకు కుడివైపుకు తిరిగాడు. అంతలో మరిపెడ నుంచి దంతాలపల్లికి వెళుతున్న కారు వీరి ఆటోను ప్రమాదవశాత్తు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు వచ్చిన శబ్ధానికి కిలోమీటరు దూరంలో ఉన్న వారు కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఆటో రెండు ముక్కలుగా విడిపోయింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

ఈ ఘటనలో ఆటోలో ఉన్న బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన పగిండ్ల కుమార్​, వాల్య తండాకు చెందిన భూక్య నరేశ్​, తొర్రూరు మండలం వెలికట్టకు చెందిన ఆటోడ్రైవర్​ బందు మల్లేశ్​ మృతిచెందారు. వీరిలో నరేశ్​, మల్లేశ్​ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, కుమార్​ను 108 అంబులెన్స్​లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఆటోలో ఉన్న కుమార్​ భార్య మంజుల, కుమార్తెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. మహబూబాబాద్​ మండలం అమనగల్లుకు చెందిన మరో మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే మంజుల పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.

గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంతో పాటు పోలీస్​ పెట్రోలింగ్​ వాహనంలో వైద్య చికిత్స నిమిత్తం వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మెదక్​ జిల్లాలో రహదారులు రక్తసిక్తం - వేర్వేరు ఘటనల్లో ఆరుగురి దుర్మరణం - Medak Road Accident Today

అలంకరణ పనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - ముగ్గురు కూలీలు మృతి - Three killed in Accident At guntur

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.