Road Accident in Palaparru Cold Storage: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు కోల్డ్ స్టోరేజీ (Cold Storage) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనగలోడుతో వెళ్తున్న ట్రాక్టర్, వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని కూలీలకు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి 108కి సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సుమారు 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. బాధితులు కాకుమాను మండలం అప్పపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి- ఇంకొకరికి తీవ్ర గాయాలు
One Jawan Dead in Road Accident in kosamgipuram: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) సీఆర్ఫీఎఫ్ జవాన్ మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడటంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాధితుడిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు. మృతుడు సోంపేట మండలం జీడిపుట్టుగ గ్రామానికి చెందిన చైతన్యగా పోలీసులు గుర్తించారు.
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం ద్వారకానగరంలో ప్రమాదం చోటు చేసుకుంది. గుంతల రహదారిపై ట్రాక్టర్ వెళ్తుండగా డ్రైవర్ పక్కనే కూర్చొన్న మరొ వ్యక్తి కుదుపులకు ఒక్కసారిగా కిందపడిపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు వ్యక్తులు మృతి - Road Accident