ETV Bharat / state

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి - Kodada Road Accident Today - KODADA ROAD ACCIDENT TODAY

Kodad Road accident Today : సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Road Accident in Kodada at Suryapet District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 7:00 AM IST

Updated : Apr 25, 2024, 10:25 AM IST

Road Accident in Kodad at Suryapet District : సూర్యాపేట జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ఆరుగురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో కారులో పది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. గాయపడిన నలుగురిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్​ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్​ పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్​ తన రెండో కుమార్తె లాస్యకు చెవులు కుట్టించేందుకు హైదరాబాద్​ నుంచి 10 మంది కుటుంబ సభ్యులతో విజయవాడలోని గుణదల చర్చికి కారులో బయలుదేరారు.

ఒకే బైక్​పై ప్రయాణం - బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి - Road Accident in Warangal District

ఆగి ఉన్న లారీని ఢీకొని : ఈ క్రమంలో కోదాడ బైపాస్​లోని దుర్గాపురం స్టేజ్​ వద్దకు రాగానే జాతీయ రహదారి పక్కనే నిలిపి ఉన్న లారీని బలంగా వారి కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందిన స్థానికులు వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు శ్రీకాంత్​, లాస్య, మణిక్యమ్మ, చందర్రావు, స్వర్ణ, కృష్ణంరాజులుగా గుర్తించారు. క్షతగాత్రులు నాగమణి, లావణ్య, కౌశిక్​, కార్తీక్​లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారు నివసించే ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మరో పది నిమిషాల్లో మృతుడు శ్రీకాంత్​ స్వస్థలానికి వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

ఎన్టీఆర్​ జిల్లాలో స్కూల్ బస్సు-బైక్​ ఢీ - ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - TODAY ACCIDENTS IN AP

ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ : రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, మృతదేహాలను పరిశీలించారు. అనంతరం యాక్సిడెంట్​ జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల పరిస్థితులను స్థానికులు, పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. ఓవర్​ స్పీడ్​తోనే కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టిందని ఎస్పీ తెలిపారు.

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి

"ఈరోజు ఉదయం 4.30 గంటలకు ఒక కారులో 10 మంది కుటుంబ సభ్యలు ప్రయాణిస్తున్నారు. అందులో నలుగురు చిన్నారులు, మిగిలిన వారు పెద్దవారు. కోదాడ దగ్గరలో ఎన్​హెచ్​ 65 మీద ఒక లారీ బ్రేక్​ డౌన్​ అయి నిలిపి ఉంటుంది. వీరి కారు అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వెంటనే కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు." - రాహుల్​ హెగ్దే, ఎస్పీ

ఆర్టీసీ బస్సు బోల్తా - స్టీరింగ్ పనిచేయకపోవడంతో గుంతల్లోకి దూసుకెళ్లిన బస్సు - Bus accident in Sathyasai district

Last Updated : Apr 25, 2024, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.