ETV Bharat / state

వెలుగుచూసిన మరో భూ బాగోతం - రికార్డులు తారుమారు - భూమి లేకుండానే రైతులుగా పేర్లు నమోదు - Land Encroachment in Mallavalli

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 8:25 AM IST

Land Encroachment in Mallavalli: వైఎస్సార్సీపీ హయాంలో సాగించిన భూదందాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడమేగాక, నకిలీ పేర్లతో పట్టాలు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులనూ ఇబ్బందిపెట్టారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో సాగిన భూ మాయాజాలంపై కథనం.

Land Encroachment in Mallavalli
Land Encroachment in Mallavalli (ETV Bharat)

Land Encroachment in Mallavalli: కృష్ణా జిల్లాలో మల్లవల్లిలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల పోరంబోకు భూమి గత ప్రభుత్వ హయాంలో మాయమైంది. దొంగపట్టాలు సృష్టించి ఇష్టానుసారం పంచిపెట్టడంతో, పట్టాలు ఉన్న రైతులకూ భూమి లేదనే పరిస్థితి తలెత్తింది. ఇక్కడి పారిశ్రామికవాడను అడ్డుపెట్టుకుని గత పాలకులు దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారు. అసలు భూమిలేనివారి పేర్లు రికార్డుల్లో కనిపిస్తున్నాయని, తరాలుగా పంటలు పండించుకుని పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న తమ పేర్లు రికార్డుల్లో మాయం చేశారని రైతులు వాపోతున్నారు.

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటు చేసింది. అడవి పోరంబోకు భూములు 1466 ఎకరాలు సేకరించింది. ఇందులో 13 వందల 66 ఎకరాలు ఏపీఐఐసీకి ఇవ్వగా, మరో 100 ఎకరాలను సామాజిక అవసరాలకు కేటాయించారు. వాస్తవానికి మల్లవల్లిలోని సర్వే నంబరు-11 అడవి పోరంబోకుగా ఉంది. కానీ ఎంత విస్తీర్ణంలో ఉందన్నది ఆర్‌ఎస్‌ఆర్‌లో లేదు. దీనిపక్కనే సర్వే నంబరు 5లో పట్టా భూమి ఉంది.

ఇది 308 ఎకరాలుగా గ్రామ పటంలో గుర్తించారు. వీటికి ఆనుకుని సర్వేనంబరు 1లో 130 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. ఇందులో 30 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇవ్వగా, మిగిలిన భూమి వైఎస్సార్సీపీ నేత ఆక్రమించి సాగు చేస్తున్నాడు. గత ఐదేళ్లలో ఈ మూడు సర్వేనెంబర్లలోని భూముల రికార్డులు మార్చి ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో ఒరిజనల్ పట్టాలు ఉన్న రైతులు ఆందోళనకు దిగారు.

ఆశ్చర్యపోయిన అధికారులు - మదనపల్లెకి తండోపతండాలుగా తరలివచ్చిన బాధితులు - Victims Complaint on YSRCP Leaders

సర్వేనెంబరు 11 అడవిపోరంబోకు, సర్వేనెంబరు 1 రెవన్యూ పోరంబోకు కాబట్టి ఆపేరుతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో పట్టాభూమి సర్వేనెంబరు 5తో పలువురికి రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాదాపు 133 ఎకరాలను 16 మంది పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. రికార్డులన్నీ తారుమారు చేశారు. ఇస్టానుసారంగా డివిజన్లు చేశారు.

సర్వే నెంబర్‌ 5లో 308 ఎకరాలు ఉండగా, రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి కేవలం 185 ఎకరాలనే చూపుతున్నారు. 2019లో వెబ్‌ల్యాండ్‌లో రికార్డులను మార్చారు. దొంగపట్టాలతో భూములు ఉన్నట్లు బ్యాంకుల్లో రుణాలూ తీసుకున్నారు. మరికొంత మంది ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకున్నారు. నాడు పనిచేసిన ఓ తహసీల్దార్, ఇతర అధికారులు కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో ఇక్కడి రైతుల్లోనూ ఆందోళన మొదలైంది. రికార్డులు మాయం కాకుండా చూడాలని కోరుతున్నారు. మల్లవల్లి గ్రామంలో సర్వే చేయాలని, చర్యలు తీసుకోవాలంచూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

రాగానిపల్లి భూములపై భారీ కుట్ర - 982 ఎకరాల కొట్టేసి ప్రభుత్వానికే విక్రయించేందుకు ప్లాన్ - YSRCP Leaders Land Grabbing

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.