ETV Bharat / state

ఆ గ్రామస్థుల మూకుమ్మడి తీర్మానం - లోక్​సభ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం - 4 Villages People Boycott Elections

MBNR 4 villages people Decided to Boycott Elections : మహబూబ్​నగర్ జిల్లాలో నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి భూములను సేకరించి కాలుష్యం వెదజల్లే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు వెల్లడించారు.

MBNR 4 villages people Decided to Boycott Elections
MBNR 4 villages people Decided to Boycott Elections (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 10:32 PM IST

Mahbubnagar 4 villages people Decided to Boycott Elections : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. కాలుష్యం వెదజల్లే అమర రాజా ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయలని డిమాండ్‌ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న నాలుగు గ్రామాలకు చెందిన భూముల్లో ఐటీపార్క్‌ ఏర్పాటు చేస్తామని గతంలో భూసేకరణ చేపట్టి ఇప్పుడు కాలుష్యం వెదజల్లే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు స్వపక్షంలోకి వచ్చాక అనుమతులు వచ్చాయని ఇప్పుడేం చేయలేమని దాట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

4 Villages People Decided To Boycott Elections : భారీగా ఖర్చులు పెట్టుకుని కంపెనీపై పోరాటం చేసేందుకు తమకు అంత శక్తి లేదని నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు తెలిపారు. రెక్కాడితే డొక్కాడని బతుకులు ఇక్కడి ప్రజలవని అన్నారు. కాలుష్య పరిశ్రమల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా గత 50 రోజుల నుంచి నిరసన దీక్షలు చేపట్టినా స్పందన కరవైందన్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకుపోయేందుకే ఎన్నికలను బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రశ్నించే అవకాశం కోల్పోతామని తెలిసినా : రాజ్యాంగం తమకు ఓటు హక్కు కల్పించిందని ఓటు వేయ్యకపోతే ప్రశ్నించే అవకాశం కోల్పోతామని తెలిసినా తమ బతుకులు ఆగమవుతున్న తరుణంలో ఓటు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. సుమారు 10 వేల ఓట్లు కలిగిన ఏదిర, సిద్దాయపల్లి, అంబట్‌పల్లి, దివిటిపల్లి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి ఓట్లను బహిష్కరిస్తామన్నారు.

"మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేది ఈ ఎన్నికల బహిష్కరణ ముఖ్యఉద్దేశం. మా నుంచి భూమిని సేకరించి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించారు. మేము మా ఇబ్బందులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి నుంచి స్పందన లేదు. మా ప్రాణాలకే రక్షణ లేనప్పుడు ఈ ఊరేందుకు, ఎమ్మెల్యేలు వారంతా ఎందుకు"- స్థానికుడు

అమరరాజా పరిశ్రమ ఏర్పాటు వల్ల కాలుష్యం విడుదలయ్యి తమ 4 గ్రామాల ప్రజలకు అనర్థం జరుగుతుందనే ఉద్దేశంతోనే దానికి తాము వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాం అని 4 గ్రామాలకు చెందిన ప్రజలు తెలియజేశారు. ఆ ప్రాంతంలో మరే పరిశ్రమ ఏర్పాటు చేసినా తమకు సమ్మతమేనని తెలిపారు.

ఆ జిల్లా గ్రామస్థుల మూకుమ్మడి తీర్మానం- లోక్​సభ ఎన్నికలు బహిష్కరించేందుకు నిర్ణయం (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.