ETV Bharat / state

కుమారుడే హంతకుడు - రియల్టర్‌ కమ్మరి కృష్ణ మర్డర్​ కేసు చేధించిన పోలీసులు - Shadnagar Realtor KK Murder Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 5:07 PM IST

Realtor Kammari Krishna Murder Case Update : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన కమ్మరి కృష్ణ హత్యకేసు చిక్కుముడి వీడింది. రియల్టర్‌ కృష్ణను అతడి మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఆస్తి విషయమై ఈ దారుణానికి ఒడిగట్టాడని, రూ. 25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

realtor_kammari_krishna_murder_case_update
realtor_kammari_krishna_murder_case_update (ETV Bharat)
రియల్టర్‌ కమ్మరి కృష్ణ మర్డర్​ కేసు చేధించిన పోలీసులు- తండ్రి హత్యకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చిన కొడుకు (ETV Bharat)

Police Solved Shadnagar Realtor Murder Case : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్న కుమారుడే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి మరీ తండ్రిని హత్య చేయించాడు. రంగారెడ్డి జిల్లా కమ్మదనంలో ఈ నెల 10వ తేదీన జరిగిన కమ్మరి కృష్ణ హత్య కేసును షాద్​నగర్ పోలీసులు ఛేదించారు. షాద్​నగర్ పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ హత్య​ వివరాలు వెల్లడించారు.

రియల్టర్‌ కమ్మరి కృష్ణను అతడి మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడో భార్య అయిన కమ్మరి పావని పేరుతో కృష్ణ ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని, ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం మూడో భార్యకే రాసేస్తాడనే కోపంతోనే మొదటి భార్య కుమారుడైన కమ్మరి శివ తన తండ్రిని హత్య చేయించినట్లు వివరించారు. దీనికోసం రూ.25 లక్షల సుపారీ ఇచ్చి మరీ ముగ్గురితో హత్య చేయించినట్లు పేర్కొన్నారు.

రూ.25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య : నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పథకం ప్రకారమే తన తండ్రి అంగరక్షకుడు శివానంద్ అలియాస్ బాబాకు విషయం చెప్పి హత్యకై ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. రూ.25 లక్షలు సుపారి ఒప్పందం కుదుర్చుకున్న శివానంద్​ తన సన్నితులైన గణేశ్​, జేసీఎల్( మైనర్) ముగ్గురు కలిసి హత్య చేయాలని అవకాశం కోసం ఎదురు చూశారన్నారు.

ఈ నెల 10 వ తేదీన కమ్మదనం శివారులోని కేకే ఫామ్ హౌస్​లో కృష్ణను హత్య చేయడానికి నిశ్చయించుకుని, ఫామ్ హౌస్​లో కేకేను గణేశ్​, మైనర్ బాలుడు చేతులు పట్టుకోగా బాబా కత్తితో కృష్ణ గొంతు కోసి ఆ తర్వాత కడుపులో పొడిచినట్లు వివరించారు. అనంతరం వారు పారిపోయారని, కేకే మూడో భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు డీసీపీ పేర్కొన్నారు. హత్య కేసును చేధించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు . ఉన్నతాధికారుల చేత బృందానికి రివార్డు ఇప్పించినట్టు వివరించారు.

కట్టుకున్నోడిని చంపుతుంటే బయట కాపలా కాసింది - కట్టుకథ చెప్పి అడ్డంగా దొరికిపోయింది - WIFE KILLED HUSBAND WITH LOVER HELP

బాలిక హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య- కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం - Girl Murder Case Accused Suicide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.