CM Chandrababu 100 Days Ruling : రాష్ట్రం వరద విపత్తులో చిక్కుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన పాలనాదక్షత భావితరాలకు, నాయకులకు ఓ పాఠం అని పలువురు క్రీడా, సినీ ప్రముఖులు కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో మరింత పురోగమిస్తుందని, అందుకు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, విజన్ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు వంద రోజుల పాలన బాగుంది : "ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల పాలన బాగుంది. సీఎం చంద్రబాబు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు తన విజన్‌తో రాష్ట్ర అభివృద్ధి పాటుపడుతున్నారు. చంద్రబాబుని చూసి గర్వపడుతున్నా. ప్రజల సుఖశాంతులు, సంతోషమే అజెండాగా పాలన సాగిస్తున్నారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తాను. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను." - సోనూ సూద్, ప్రముఖ సినీ నటుడు
అదీ చంద్రబాబు దక్షత : "వరద కష్టాల్లోంచి ప్రజలను బయట పడేయడంలో చంద్రబాబు విజన్, పాలన కనిపించాయి. విపత్తు నిర్వహణ ఎలా చేయాలో భావితరాలకో పాఠంలా చూపించారు. ఆయన పాలనాదక్షత వల్లే వరద కష్టాల్లోంచి ప్రజలు త్వరగా కోలుకున్నారు." -పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్
అన్నింటా.. ఏపీ అభివృద్ధి బాట : "ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్రం పురోగమిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆనాడు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌కు హైదరాబాద్‌ను వేదికగా నిలిపారు. ఇప్పుడు ఆయన పాలనలో క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి చెందాలి." -మిథాలీరాజ్, మహిళా క్రికెటర్
సీఎంకు మరింత బలం చేకూరాలి : "ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ, అనుకోని విపత్తుల్ని సమర్థంగా అధిగమిస్తూ, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ఆయన కార్యదక్షతకు భగవంతుడు మరింత బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను." - ఉదయభాను, టీవీ వ్యాఖ్యాత
నాయకత్వమంటే ఏంటో చూపించారు : "నిజమైన నాయకత్వం అంటే ఎలా ఉంటుందో ఈ వంద రోజుల్లోనే చంద్రబాబు చూపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో, రాష్ట్ర భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపిన మార్గం అభినందనీయం." - సునీతా కృష్ణన్, సామాజిక కార్యకర్త
ఇలాంటి ప్రభుత్వమే అవసరం : "ఏపీ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగంలో కొనసాగుతున్నందుకు గర్వంగా భావిస్తున్నా. నాకీ అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. ఆర్థిక కష్టాలను, విపత్తులను చంద్రబాబు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంతోనే రాష్ట్రం విషత్తుల నుంచి బయటపడింది. ఆ గొప్ప వ్యక్తికి క్రీడాకారుల తరపున శుభా కాంక్షలు. ఇలాంటి ప్రభుత్వమే రాష్ట్రానికీ, ప్రజలకు అవసరం." - పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
రెండో విడత అన్న క్యాంటీన్లు ప్రారంభం- స్వయంగా అన్నం వడ్డించిన సీఎం - second phase of Anna Canteens