ETV Bharat / state

భార్యను మాటలతో కాల్చుకుతిన్న భర్త!- రాయచోటి గ్యాస్‌ సిలిండర్‌ లీక్ ఘటనలో వీడిన మిస్టరీ - Mother Suicide Two Kids Rayachoty

Mother Suicide Two Kids in Rayachoty : అనుమానం పెనుభూతమైంది. చివరకు కట్టుకున్న భార్యమీదే భర్త నిఘా పెట్టే పరిస్థితికి వెళ్లింది. పడక గదిలోనూ సీసీ కెమెరాలు అమర్చేంత నీచానికి దిగజారింది. భార్యకు ఫోన్‌ చేయడం సూటిపోటి మాటలతో కాల్చుకుతినడం నిత్యకృత్యమైంది. భర్త వేధింపులు భరించేకన్నా తనకుతాను కాల్చుకోవడం మేలనుకుంది ఆ ఇల్లాలు! బంగారం లాంటి ఇద్దరు బిడ్డలను పక్కనే పెట్టుకుని గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దంపతుల మధ్య గొడవలకు అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు బలవడం కలిచివేస్తోంది.

Mother Suicide Two Kids in Rayachoty
Mother Suicide Two Kids in Rayachoty (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 10:28 AM IST

Gas Cylinder Blast Case in Rayachoti : అనుమానం పెనుభూతమై ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రాజేస్తుంది. పచ్చని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఒక్కొసారి వారిలో ఎవరి ఒకరో చావడం లేదా చంపడమో జరుగుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాయచోటిలో సిలిండర్‌ పేలి తల్లి, ఇద్దరు పిల్లలు మరణించిన కేసులో మిస్టరీ వీడింది.

Police Solved Gas Cylinder Blast Case : లక్కిరెడ్డిపల్లెకు చెందిన రాజాకు, దానంరెడ్డిగారిపల్లెకు చెందిన రమాదేవితో పదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాయి మనోహర్‌కు తొమ్మిదేళ్లు, అమ్మాయి మాన్వితకు ఐదేళ్లు. ఐదు సంవత్సరాల క్రితం దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లారు. రెండేళ్ల క్రితం రమాదేవి.,తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని రాయచోటికి వచ్చింది! టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

కువైట్‌లోనే ఉన్న రాజా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లోకి ఎవరు వచ్చివెళ్తున్నారో దుబాయ్‌ నుంచే తెలుసుకునేందుకు రాయచోటిలో భార్య ఉండే ఇంటి బయట, బెడ్ రూం, వంటగదిలో సీసీ కెమెరాలు పెట్టించాడు. కెమెరాను తన మొబైల్ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకున్నాడు. ఇంటికి ఎవరు వచ్చి వెళ్లినా రమాదేవికి ఫోన్​చేసి సూటిపోటి మాటలతో కాల్చుకుతినేవాడు. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది.

Mother Suicide 2 Kids in Rayachoty : భర్త వేధింపులు తట్టుకోలేని రమాదేవి శుక్రవారం రాత్రి తన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపింది. తాము చనిపోతామని మృతదేహాల్ని అత్తింటివారికి అప్పగించకుండా మున్సిపాలిటివాళ్లకు అందించాలని మెసేజ్‌ చేసింది. అన్నంత పనీ చేసింది. శనివారం తెల్లవారుజామున వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బెడ్ రూంలోకి తెచ్చింది. గ్యాస్ పైపును బలవంతంగా కత్తితో కోసి లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపుల్లతో నిప్పు వెలిగించింది. ఒక్కసారిగా గుప్పుమన్న మంటల్లో ముగ్గురు రమాదేవితోపాటు ఇద్దరు పిల్లలూ సజీవ దహనమయ్యారు.

గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు : మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ఘటనపై రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దుబాయ్‌లో ఉన్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కువైట్‌ నుంచి రావాలని రాజాకు పోలీసులు కబురుపెట్టారు. ఆత్మహత్యకు ముందు రమాదేవి పంపిన వాయిస్ మెసేజ్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపారు.

నమ్మించి మోసం చేసిన కుమారుడు- తల్లిదండ్రుల ఆత్మహత్య - Couple Commits Suicide due to Debts

బాపట్ల జిల్లాలో విషాదం- భార్యను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త - HUSBAND KILLED WIFE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.