ETV Bharat / state

విజయవాడతో ప్రత్యేక అనుబంధం - పలుమార్లు పర్యటించిన రతన్​ టాటా - TATA TRUST RELATION WITH AP

ఎన్టీఆర్​ జిల్లాలో టాటా ట్రస్ట్​ సేవలు - 264 గ్రామాలకు కోట్లు వెచ్చించి అభివృద్ధి

Ratan Tata Attachment with Vijayawada
Ratan Tata Attachment with Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2024, 10:29 PM IST

Ratan Tata Attachment with Vijayawada: నింగికేగిన మేరు నగధీరుడు రతన్ టాటాకు విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాతో ఎంతో అనుబంధముంది. పలుమార్లు రతన్ టాటా జిల్లాలో పర్యటించారు. 264 గ్రామాల్లో ట్రస్టు సేవలను చేపట్టి కోట్లు వెచ్చించారు. రతన్ టాటా నిష్క్రమణంతో అందరూ ఆ మహునుభావుడి సేవలను స్మరించుకుంటున్నారు.

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో టాటా ట్రస్టు విజయవాడ పార్లమెంటు పరిధిలో సేవలు ప్రారంభించింది. 2015 నుంచి 2019 వరకు ఇవి కొనసాగాయి. నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనసాగిన సేవలు తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి ఊసు పెద్దగా లేకుండా పోయింది. మొదట పార్లమెంటు సభ్యుడుగా ఉన్న కేశినేని నానికి 2015లో టాటా సంస్థ నుంచి ఒక లేఖ అందింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే.. అభివృద్ధికి కావాల్సిన నిధులు అందిస్తామనేది ఆ లేఖ సారాంశం.

ఎం.కొండూరు మండలం గొల్లమందల గ్రామాన్ని నాటి ఎంపీ కేశినేని నాని ఎంపిక చేసుకుని లేఖ రాశారు. దేశంలో మిగిలిన ఎంపీల నుంచి అంతగా స్పందన రాకపోవడంతో విజయవాడ పార్లమెంటులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ కేశినేని నాని కోరిక మీదట ఈ పార్లమెంటు స్థానాన్ని ట్రస్టు ఎంపిక చేసింది. నియోజకవర్గంలో పరిధిలో మూడు అసెంబ్లీ సెంగ్మెంట్లు నగరంలో పరిధిలో ఉన్నాయి. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు పరిధిలో 264 గ్రామాల్లో విద్య, ఉపాధి, వైద్యం, గ్రామీణ అభివృద్దికి టాటా ట్రస్టు సేవలు ప్రారంభించింది.

ముందుగా ఎ.కొండూరు మండలం గొల్లమందలలో టాటా ట్రస్టు, ఎంపీ నిధుల ఆధ్వర్యంలో సిసీ రహదారుల నిర్మాణం చేశారు. ముందుగా టాటా ట్రస్టు ఆధ్వర్యంలో 264 గ్రామాల్లో డాటా సేకరణ ప్రారంభించారు. గ్రామానికి ఏం కావాలనే అంశంపై 1200 మంది వలంటీర్లు 90 రోజులపాటు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించారు. దాని ప్రకారం ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. దీనిలో భాగంగా ముందుగా టెలిమెడిసిన్‌ కేంద్రాలను టాటా ట్రస్టు ప్రారంభించింది. మొదలం 16 మండలాల్లో మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి రోగులను వీసీలో ప్రత్యేక నిపుణులకు చూపించి వారి సలహాలతో మందులు అందించేవారు. ఇది 16 మండలాల్లో చాలా బాగా పనిచేసింది.

వీటితోపాటు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులను పరీక్షించి మందులు ఇచ్చేవారు. వైద్యసేవల్లో భాగంగా రెండు బస్సులు ఏర్పాటు చేసి గ్రామాల్లో శిబిరాలు నిర్వహించేవారు. ప్రతి కుటుంబానికి స్వస్థ కుటుంబం పేరుతో ఆరోగ్య కార్డులు టాటా ట్రస్టు జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా ఏడాదికి లక్ష విలువైన చికిత్సలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేవి. దాదాపు 2.50 లక్షల కుటుంబాలకు ఈ కార్డులను అందించారు. ఈ కార్డుల ద్వారా గర్భిణిలకు ప్రయోజనం కలిగింది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకునేవారు. అంగన్‌వాడీ కేంద్రాలను రీ మోడలింగ్‌ చేశారు. ఆకర్షణీయమైన బల్లలు ఏర్పాటు చేశారు. పౌష్టికాహారం పలు గ్రామాలకు అందించారు.

గ్రామాల్లో పారిశుద్ద్య కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి రిక్షాలు, చెత్తబుట్టలు గ్రామాల్లో అందించారు. మంచినీటి సరఫరా ట్యాంకులు నిర్మాణం చేయించారు. ఇంకుడు గుంతలు తవ్వించారు. జలజీవన్‌ మిషన్‌లోనూ ఇంటింటికి కుళాయి ఇవ్వాలనే దానిపై టాటా ట్రస్టు భాగస్వామ్యమైంది. కొన్ని గ్రామాల్లో రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత విజయవాడ పార్లమెంటు పరిధిలో టాటా ట్రస్టు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. టాటా ట్రస్టు ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంటే రెండో కార్యాలయం 2015లోనే విజయవాడలో ఏర్పాటు చేశారు. ఎంతోమంది యువకులకు టాటా ట్రస్టు కింద వాటంటీర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో వారు కొనసాగడం లేదు.

ఇంటర్నెట్‌ సాథీ అనే మరో కార్యక్రమం చేపట్టారు. గ్రామీణ మహిళలకు ఇంటర్నెట్‌ ఎలా వినియోగించుకోవాలనే అంశంపై శిక్షణ కల్పించారు. దీనిలో భాగంగా 7వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. కుట్లు అల్లికలు, ఇతర నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను 30వేల మంది మహిళలకు అందించి స్వయం ఉపాధి పొందేలా ఏర్పాటు చేశారు. తిరువూరు అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలోని కోడూరు గ్రామానికి చెందిన యువతి స్పందన కుట్టుమిషన్‌ ద్వారా దుస్తులు కుట్టేది. టాటా ట్రస్టు సేవల్లో భాగంగా ఇంటెర్నెట్‌సాథీ కార్యక్రమంలో స్పందన భాగస్వాములయ్యారు.

టాటా ట్రస్టు వాటంటీర్లు ఆమెకు ఇంటర్నెట్‌ ఉపయోగించడమెలా అనేదానిపై శిక్షణ ఇచ్చారు. నైపుణ్యాలు పెంచేందుకు అవగాహన కల్పించారు. తర్వాత ఆమె ఇంటర్నెట్‌ వినియోగం ద్వారా సరికొత్త డిజైన్లు రూపొందించి కుట్టేవారు. భిన్నరకాలుగా కుట్టడం నేర్చుకోవడం ద్వారా ఆదాయం పెరిగింది. ఇలా ఆమె ఒక్కరే కాదు వేలమందికి ఇంటర్నెట్‌ సాథీ కార్యక్రమం ఉపయోగ పడింది. నాడు..నేడు తరహా పనులు బడుల్లో టాటా ట్రస్టు ఎప్పుడో చేపట్టింది. కొన్ని మండలాల్లో పార్కులు అభివృద్ది చేశారు. దాదాపు 400 వరకు మంచినీటి ట్యాంకులు గ్రామాల్లో నిర్మాణం చేశారు. చెత్త రిక్షాలు, బుట్టలు పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాలు అందించారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణలు ఇచ్చారు. 2019 తర్వాత సేవలు నిలిచిపోయాయి.

ఇవే కాదు విద్య, వైద్యం, ఉపాధి అంశాలతో పాటు గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా టాటా ట్రస్టు అందించిన సేవలు మరువలేనివి. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 264 గ్రామాలను స్మార్టు విలేజ్‌లుగా రూపొందించేందుకు టాటాట్రస్టు సేవలు ప్రారంభించి నాలుగేళ్ల పాటు కొనసాగించింది. దాదాపు ఒక్క విజయవాడ పార్లమెంటు పరిధిలో 264 గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలకు సుమారు 3వేల కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ప్రధాని మోదీ సంసాద్‌ ఆదర్శ గ్రామ యోజన ఆలోచనలో భాగంగా గ్రామీణాభివృద్ధికి టాటా ట్రస్టు విజయవాడ పార్లమెంటును ఎంపిక చేసుకుని నాటి ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ చొరవతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.

2019 తర్వాత ఎంపీ ఎన్నికైనా ప్రభుత్వం మారడంతో సేవా కార్యక్రమాలు దాదాపు నిలిచిపోయాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో అయిదు గ్రామాలను టాటా ట్రస్టు ఎంపిక చేయాలని భావించి క్రమేపీ మొత్తం 264 గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శగ్రామాలకుగా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనిపై 2015 ఆగస్టు 24న విజయవాడలో భారీ కార్యక్రమం జరిగింది. దత్తత స్వీకార కార్యక్రమానికి ఛైర్మన్‌ రతన్‌ టాటా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు హాజరై ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు. అదే రోజు గేట్‌వే హోటల్‌లోనూ పారిశ్రామిక సదుస్సులో రతన్‌ టాటా పాల్గొన్నారు.

16 మండలాల్లో 22 టెలిమెడిసిన్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసి స్పెషలిస్టులతో చికిత్స అందించేవారు. 120 మంది వైద్యులను నియమించి రెండు బస్సులు ఏర్పాటు చేసి శబిరాలు నిర్వహించేవారు. వీటిద్వారా 1.40 లక్షల మందికి వివిధ రకాల చికిత్సలు, మందులు అందించారు. టెలిమెడిసిన్‌ కేంద్రాల ద్వారా దాదాపు లక్ష మందిక ఇగా చికిత్స పొందారు. ఒక్కో టెలిమెడిసిన్‌ కేంద్రానికి 60లక్షల వరకు ఖర్చు చేశారు. బీమా కార్డుల ద్వారా 16వేల మందికి ఉచిత ప్రసవాలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేశారు. ఎ.కొండూరు మండలంలో వైద్యశిబిరాల ద్వారా అక్కడ కిడ్నీ వ్యాధుల తీవ్రత వెలుగు చూసింది. ఇబ్రహీంపట్నంలో 50లక్షలతో సెంట్రల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇలా వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చి సేవలు అందించారు.

ఇలా విజయవాడతో రతన్‌ టాటాకు అనుబంధం ఎక్కువే. మధ్యతరగతి కుటుంబానికి లక్షకే కారు నానో అవిష్కరించిన తర్వాత ఆయన 2011 ఆగస్టు 20న విజయవాడకు వచ్చారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆయనను లారీ డ్రైవర్లు తప్పించి సమావేశానికి పంపారు. తర్వాత 2015లో గ్రామాల దత్తత కార్యక్రమానికి టాటా హాజరయ్యారు.

'దేశానికే తీరని లోటు' - రతన్ టాటాకు ఆంధ్రప్రదేశ్​ మంత్రివర్గం నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.