Rare Surgery in Guntur Vikas Hospital : గుంటూరు వికాస్ ఆసుపత్రి వైద్యులు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా అరుదైన శస్త్రచికిత్స చేశారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాము అనే వ్యక్తి కడుపు నొప్పి సమస్యతో వైద్యులను కలిశారు. గుండె నుంచి శరీరానికి రక్తం సరఫరా చేసే రక్తనాళం ఇన్ ఫెక్షన్ కు గురై ఉబ్బిపోయి పొట్టలోకి రక్తం కారుతోందని నిర్ధారించారు. దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెన్నై వెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు రూ. 20 లక్షలు అవుతుందని చెప్పడంతో అంత డబ్బు లేక రాము తిరిగి వచ్చేశారు.
పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు : గుంటూరు వికాస్ ఆసుపత్రిలో ఈ తరహా జబ్బుకు ఆపరేషన్ చేస్తారని తెలియటంతో వారిని సంప్రదించారు. వికాస్ ఆసుపత్రి వైద్యులు సురేంద్ర ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే రక్త నాళం ఇన్ ఫెక్షన్ కు గురి కావటంతో దాని స్థానంలో పశువు గుండె నుంచి తీసిన రక్తనాళాన్ని అమర్చి ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం రాము ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యులు తనకు పునర్జన్మ ప్రసాదించారని రాము కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ వైద్యసేవలో ఇలాంటి ప్రమాదకర జబ్బులకు చికిత్స అందించే వీలుండటం వల్లే ఆపరేషన్ సాధ్యమైందని వికాస్ వైద్యులు తెలిపారు.
భయపెడుతోన్న హెచ్‌ఎంపీవీ - ఎలా వ్యాపిస్తుంది? ఎలా అడ్డుకోవాలి?
దేశంలో అరుదైన వ్యాధి విజృంభణ- వారంలోనే 100 మందికి వ్యాప్తి! లక్షణాలు, కారణాలు ఏంటి?