ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో శరవేగంగా పారిశుద్ధ్య పనులు - దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేతలు - Sanitation Works in Flooded Areas - SANITATION WORKS IN FLOODED AREAS

Rapid Sanitation Works in Flooded Areas in Vijayawada : విజయవాడ ముంపు ప్రాంతాల్లో శరవేగంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు కాలనీలు వరద ముంపు నుంచి బయటకొస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక, పారిశుద్ధ్య సిబ్బంది పలు చోట్ల బురదను తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఫైరింజిన్ల, పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినట్లు అధికారులు తెలియజేశారు.

SANITATION WORKS IN FLOODED AREAS
SANITATION WORKS IN FLOODED AREAS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 2:54 PM IST

ముంపు ప్రాంతాల్లో శరవేగంగా పారిశుద్ధ్య పనులు - దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేతలు (ETV Bharat)

Rapid Sanitation Works in Flooded Areas in Vijayawada : విజయవాడలో యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం సహాయచర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఫైరింజన్ల, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. సెలవులు కూడా తీసుకోకుండా సహాయ చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. సహాయచర్యలను మంత్రులు ఎప్పుడికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.

Fire Engine Staff Removing Mud on Flood Areas in Vijayawada : విజయవాడలో వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు శుభ్రం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 113 ఫైరింజిన్లను విజయవాడకు చేరుకున్నాయి. బుధవారం 50 ఫైరింజిన్లతో పనులు మొదలుపెట్టిన అధికారులు, ఇవాళ మరింత జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూనే, వరద తగ్గిన ప్రాంతాల్లో బాధితుల ఇళ్లు, వీధులను శుభ్రం చేసేందుకు ఫైరింజిన్ల వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆక్రమణల చెరలో ఉప్పుటేరు- దారిలేక లంకగ్రామాలను కుమ్మేస్తోన్న బుడమేరు - Kolleru Lanka Stuck in Flood Effect

మొత్తం 32 డివిజన్లలో ముంపు : విజయవాడలోని మొత్తం 32 డివిజన్లలో ముంపునకు గురైనట్లు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ అడిషనల్​ డైరెక్టర్​ శ్రీనివాస్​ వెల్లడించారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఏ రోజుకు ఆ రోజు ఇళ్లను శుభ్రం చేస్తున్నామని తెలియజేశారు. చాలా ప్రాంతాల్లో బాధితులు రోడ్డుపైన నిలిచిన నీటితోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లలోకి చేరిన వరద కారణంగా పలు వస్తువులు కొట్టుకుపోవడంతో పాటు, ఉన్నవి కూడా పాడయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పారిశుద్ధ్య పనులు వేగవంతం : రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీ నుంచి పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు తరలివచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగిస్తున్నారు. మురుగు కాలువల్లోని పూడిక రోడ్లపై మట్టిని, ఇసుక మేటలను శుభ్రం చేస్తున్నారు. రోడ్లుపై చెత్తాచెదారంతో పాటు బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్​ బ్యాటిళ్లు ఎక్కువగా ఉన్నాయని పారిశుద్ధ్య కార్మికులు తెలియజేశారు.

శాంతించిన కృష్ణమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - KRISHNA River Flood Flow Decrease

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న మంత్రులు : వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంత్రుల మధ్య పని విభజన చేసి సహాయచర్యల ఎప్పుడికప్పుడు తెలుసుకుంటున్నారు. సుమారు 200కు పైగా అగ్నిమాపక వాహనాలతో ఈ పనులను వేగవంతం చేశామని హోం మంత్రి అనిత వెల్లడించారు. బురద మయమైన వీధులతో పాటు ముంపునకు గురైన ప్రతి ఇళ్లను కూడా శుభ్రపరుస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. వరద బాధితులకు సహాయం చేయడానికి ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలివస్తున్నారు.

వరద ఉద్ధృతి నుంచి కోలుకుంటున్న విజయవాడ - పునరావాసాలు వీడి ఆవాసాలవైపు కదులుతున్న బాధితులు - Relief operations in Vijayawada

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.