ETV Bharat / state

ప్రజాహితం తప్ప, ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడు రామోజీరావు తలవంచలేదు : తుమ్మల - Ramoji Rao Memorial Sabha at CRF

Ramoji Rao Memorial Sabha at CR Foundation : ప్రజాహితం తప్ప, ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడు రామోజీ తలవంచలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ సభకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, రాజకీయ కష్టం లేదా ప్రకృతి వైపరీత్యాలు, పాలనాపరమైన ఇబ్బందులొచ్చినా ప్రజల పక్షాన మాత్రమే నిలబడ్డారని మంత్రి కొనియాడారు.

Ramoji Rao Samsmarana Sabha
Minister Tummala on Ramoji Rao Credibility (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 4:17 PM IST

Updated : Jul 6, 2024, 10:19 PM IST

Minister Tummala on Ramoji Rao Credibility : రామోజీరావు విశ్వసనీయత, గొప్పదనం అందరికీ తెలుసని, ప్రతీ సందర్భంలోనూ ప్రజల పక్షాన నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడు రామోజీ తలవంచలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు సంస్మరణ సభకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి, ఈటీవీ న్యూస్ కోఆర్డినేటర్ పోచిరాజు శ్రీరామ్, హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజని, సీఆర్‌ఎఫ్ కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి వి.చెన్నకేశవరావు, మహిళా సంస్థ ప్రిన్సిపాల్ జ్యోతిభట్ల కల్పన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావుకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. చండ్ర రాజేశ్వరరావు మహానాయకుడు స్ఫూర్తిగా ఆనాడు ఎన్టీఆర్, రామోజీరావు వామపక్ష భావజాలంతో వ్యవస్థలు, సంస్థల్లో పనిచేశారని తెలిపారు. వారే నిక్కచ్చి కమ్యూనిస్టులు అని కొనియాడారు.

1983లో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావుతో కొన్ని రాజకీయ చర్చల సమయంలో మీకంటే నేనే ఎక్కువ కమ్యూనిస్టునని ఎన్టీఆర్ అనే వారని ప్రస్తావించారు. రామోజీరావు సహా వీరంతా ఏనాడు ప్రభుత్వం, పాలకపక్షాల తరఫున నిలబడ్డ వ్యక్తులు కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, రాజకీయ కష్టం లేదా ప్రకృతి వైపరీత్యాలు, పాలనాపరమైన ఇబ్బందులొచ్చినా ప్రజల పక్షాన మాత్రమే నిలబడ్డారని మంత్రి కొనియాడారు.

దేశంలో ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వార్తా ప్రపంచం, తెలుగు భాష కోసం రామోజీరావు ఎనలేని కృషి చేశారని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. విలువలతో కూడిన వ్యవస్థలు, సంస్థలు నిర్మించిన ఘనత రామోజీరావుకే దక్కిందని ఆయన ప్రశంసించారు. సీఆర్ ఫౌండేషన్‌తో రామోజీరావుకు సంబంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రాంగణంలో వృద్ధాశ్రమం, మహిళల సాధికారత లక్ష్యంగా కుట్టు, ఇతర ఉపాధి రంగాలపై శిక్షణ ఇస్తున్నామని, దేశంలో నంబర్ 1 వృద్ధాశ్రమంగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు.

రామోజీరావు భావాలు అద్భుతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అక్షర విప్లవకారుడు, సామాజిక ఉద్యమకారుడు, అక్షరాలను పరుగులు పెట్టించిన ఘనుడు ఒకప్పుడు కమ్యూనిస్టని ప్రశంసించారు. ఉదయం ఇంటికి ఈనాడు పత్రిక చేరవేయించడమే కాకుండా 50 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించారన్నారు. ఆనాడు నేర్చుకున్న ఓనమాలే మహామనిషిగా ఎదిగేలా చేశాయని, భవిష్యత్ తరాలకుబాటగా నిలిచారని ఆయన కితాబిచ్చారు.

"రామోజీరావు విశ్వసనీయత, గొప్పదనం అందరికీ తెలుసు. ప్రతీ సందర్భంలోనూ ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడు రామోజీ తలవంచలేదు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పాలనాపరమైన ఇబ్బందులొచ్చినా ప్రజల పక్షాన మాత్రమే నిలబడ్డారు. 43 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చేది." -తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా రామోజీరావు సంస్మరణ సభ - ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్‌ - Ramoji Rao Photo Exhibition

తెలుగు జాతి కీర్తి శిఖరం రామోజీరావు - ఆయన విలువలూ విశ్వాసాలు మీకోసం - Ramoji Rao Success Story

Last Updated : Jul 6, 2024, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.