ETV Bharat / state

విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ - నివాళులర్పించిన వివిధ రంగాల ప్రముఖులు - Ramoji Rao Memorial Meeting - RAMOJI RAO MEMORIAL MEETING

Ramoji Rao Memorial Meeting at Balotsav Bhawan in Vijayawada: తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదాన్ని తన అక్షర ఆయుధంతో ప్రజల గుండెకు చేర్చిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ప్రజాసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు కొనియాడారు. రాష్ట్రానికి, వివిధ రంగాలకు రామోజీరావు విశేషమైన కృషి చేశారని తెలిపారు. విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.

ramoji rao memorial meeting
ramoji rao memorial meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 10:23 PM IST

Updated : Jun 19, 2024, 10:48 PM IST

Ramoji Rao Memorial Meeting at Balotsav Bhawan in Vijayawada: తెలుగు జాతి కోసం ఎనలేని కృషి చేసిన అక్షర యోధుడు రామోజీ రావును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం పని చేయాలని పలువురు ప్రముఖులు సూచించారు. రామోజీరావు సంస్మరణ సభను విజయవాడలో ఘనంగా జరిపారు. విజయవాడ బాలోత్సవ భవన్​లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం, కామ్రేడ్ జీఆర్కే - పోలవరపు సాంస్కృతిక సమితి నిర్వహణలో కార్యకమం నిర్వహించారు. పలు ప్రజాసంఘాల నేతలు, పాత్రికేయులు, ఛార్టర్డ్ అకౌంటెంట్​లు, పలువురు న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

AP Professional Forum President Nethi Mahesh: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఘనత రామోజీరావుదేనని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్ అన్నారు. తెలుగు తల్లి తెలుగుజాతి ఆణిముత్యాన్ని కోల్పోయిందన్నారు. కత్తి కంటే కలం గొప్పదని రామోజీరావు నిరూపించారని, కలం జర్నలిస్టుదైతే సమాజాన్ని ఎంతో మార్చవచ్చని నిరూపించారన్నారు. తెలుగు జాతికి ఒక ఐకాన్ రామోజీరావు అని కొనియాడారు. రామోజీరావు లేకపోవడం పాత్రికేయులకు, తెలుగుభాషాభిమానులకు ఎంతో నష్టమన్నారు.

'రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ- సమాజానికి ఆయన మార్గదర్శి' - tdp Leaders Tribute to ramoji Rao

TDP leader Gottipati Ramakrishna: రామోజీరావు ఓ మహోన్నత వ్యక్తని, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసంశించారు. తెలుగు జాతికి, దేశానికి రామోజీరావు అందించిన సేవలు శ్లాఘనీయమని ప్రశంసించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు పోరాటం చేశారని, అధర్మం ఓడాలి, ధర్మం గెలవాలని రామోజీరావు ఎల్లప్పుడూ అనేవారని అన్నారు. విశ్వాసం, నమ్మకంతో వ్యాపారం చేశారని, బ్యాంకుల్లో కంటే రామోజీరావు సంస్థల్లో డబ్బు ఉందంటేనే ఎంతో నమ్మకమని ప్రజలు చెప్పడమే దీనికి నిదర్శనమన్నారు. అలాంటి వ్యక్తిపై గత ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని, మార్గదర్శి, ఈనాడుపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిందని అన్నారు.

CPI State Secretary Ramakrishna: విశ్వసనీయత, కచ్చితత్వానికి ఈటీవీ, ఈనాడు మారుపేరుగా నిలిచాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రామోజీరావు కమ్యునిస్టు పార్టీ సభ్యుడిగానూ కొనసాగడం తమకు గర్వంగా ఉందన్నారు. చనిపోయే వరకు హేతువాదిగా ఉన్న ఆయన ఎవరు ఎన్ని చేసినా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడారని, ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిలబడ్డారన్నారు. రామోజీరావు తాను చెప్పాలనుకున్నదాన్ని ధైర్యంగా చెబుతారని, ధైర్యంగా సమాజంలో విలువల కోసం పోరాడారని తెలిపారు.

లైవ్​ పెయింటింగ్​ వేసి రామోజీకి నివాళులు- భారతరత్న ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు! - Tribute To Ramoji Rao

Jana Chaitanya Vedika State President Lakshman: గతంలో సారా నివారణ ఉద్యమం కోసం రామోజీరావు ఎంతో పనిచేశారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజావిజయం, మార్పు కోసం తాను పనిచేశానని చనిపోయే ముందు రోజు రామోజీరావు తనతో చివరగా చెప్పినట్లు తెలిపారు. సమాజంలో భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు లేకుండా చేయాలని నిరంతరం పోరాటం చేసిన యోధుడని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం రామోజీరావు ఆశయాలు నెరవేర్చేలా పనిచేయాలని కోరారు.

MLA Mandali Buddha Prasad: రామోజీ రావు మృతితో తెలుగు జాతి ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పత్రికా రంగంలో మహోన్నత మార్పులు తీసుకువచ్చిన మహోన్నతులు రామోజీరావని, పత్రికారంగం అభివృద్ది గురించి చెప్పాల్సి వస్తే ఈనాడు ముందు తర్వాత అని చెప్పాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి చిన్న కార్యక్రమాన్ని పేపర్లో చూసే అదృష్టం కలిగించారన్నారు.

Prajasakti Editor Tulasiram: జర్నలిజం విలువలు కాపాడటం సహా తెలుగు బాషాభ్యున్నతి కోసం రామోజీ రావు చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రజా శక్తి ఎడిటర్ తులసీరామ్ సహా పలువురు ప్రముఖులు కొనియాడారు. "అమరావతి నగర అపురూపశిల్పాలు" పుస్తకం ఆవిష్కరించిన ప్రముఖులు, కృష్ణా, గుంటూరు జిల్లాల సంబంధించి చరిత్ర, విశేషాలు వివరిస్తూ పుస్తకం ప్రచురించనున్నట్లు తెలిపారు. పుస్తకాన్ని రామోజీరావుకి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

రూపుదిద్దుకుంటున్న తెలుగు కీర్తి పతాక రామోజీ విగ్రహం - తుది మెరుగులు దిద్దుతున్న శిల్పి రాజ్‌కుమార్‌ వుడయార్‌ - Ramojirao Statue

Last Updated : Jun 19, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.