ETV Bharat / state

రామోజీరావు అనుభవాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకురావాలి : వెంకయ్య నాయుడు - Ramoji Rao Samsmarana Sabha

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 8:24 PM IST

Updated : Jul 17, 2024, 10:32 PM IST

Ramoji Group Chairman Ramoji Rao Samsmarana Sabha : ఆఖరిశ్వాస వరకూ ప్రజాపక్షం వహించిన ఏకైక వ్యక్తి దివగంత రామోజీరావు అని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసించారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్‌లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. తెలుగు ప్రజలకు రామోజీరావు చేసిన సేవలను సభలో గుర్తుచేసుకున్నారు. రామోజీరావు అనుభవాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి భావితరాలకు అందించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు.

Ramoji Group Chairman Ramoji Rao Samsmarana Sabha
Ramoji Group Chairman Ramoji Rao Samsmarana Sabha (ETV Bharat)

Ramoji Group Chairman Ramoji Rao Samsmarana Sabha Brahmakumaris : యువతరం రామోజీరావు జీవితాన్ని చదివి ఆచరించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. సమయ పాలన, క్రమశిక్షణకు రామోజీరావు మారుపేరు అని తెలిపారు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. రామోజీరావు అనుభవాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి భావితరాలకు అందించాలని కోరారు.

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించారు. రామోజీరావు కుటుంబ సభ్యులు ఈనాడు ఎండీ కిరణ్​, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్​, ఫిల్మ్​సిటీ ఎండీ విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, కీర్తి సోహన, బృహతి, దివిజ హాజరయ్యారు. ఈ సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్​ హాజరయ్యారు. అలాగే నటులు మురళీమోహన్, సుమన్​, చదలవాడ శ్రీనివాస్​, ప్రసన్న కుమార్​, ఏపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్​ సంస్మరణ సభలో పాల్గొన్నారు. అలాగే బ్రహ్మకుమారీస్​ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రామోజీరావు జర్నలిస్టుల ఫ్యాక్టరీ. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడంలో, ప్రతిభను గుర్తించడంలో ఆయనకు ఎవరూ సాటి లేరు. ప్రజా పక్షం అని పదే పదే చెప్పే వారు. ప్రజాస్వామ్యానికి ఆపద వచ్చినప్పుడల్లా ప్రజా పక్షంగా నిలిచేవారు. సమాజం పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి. సహజ వనరుల వినియోగంలో ఆయన మహా పొదుపరి. అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన వ్యక్తి." అని తెలిపారు.

"రామోజీరావు వల్ల నేను జీవితంలో ఎంతో లాభపడ్డాను. రామోజీరావు జర్నలిస్టుల ఫ్యాక్టరీ. మీడియాను ప్రజలకు అత్యంత చేరువ చేయడంలో రామోజీరావు ముందు ఉన్నారు. మీరు ఎవరి పక్షం అని నేను అడిగితే తాను ప్రజల పక్షమని రామోజీరావు చెప్పారు. ఆయన ఆఖరి శ్వాస వరకు ప్రజాపక్షమే వహించారు." - ఎం.వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి

రామోజీరావు ఎప్పుడు విదేశాలకు వెళ్లలేదు : రామోజీరావు ఎప్పుడూ విదేశాలకు వెళ్లింది తాను చూడలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఎంతో విలువలతో పెంచారని పేర్కొన్నారు. రామోజీరావు అనుభవం ఎంతో విలువైనదని అన్నారు. తెలుగు అంటే ఆయనకు ఎంతో ప్రేమని కొనియాడారు. మాతృభాషలో విద్యాభ్యాసం చేసినా ఉన్నతంగా ఎదగవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీ రావు అని గొప్పగా చెప్పారు. రామోజీరావు సింగిల్​ పీస్​ ఆయనకు ఆయనే సాటి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు.

"ఒకసారి అమెరికాలో తానా మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈ సభకు రామోజీరావు హాజరయ్యారు. నేను మిమ్మల్ని పొగడడానికి రాలేదు. విమర్శించడానికి వచ్చాను అని చెప్పారు. మీలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. నేను ఒక పేషెంట్​ను తీసుకొని వచ్చి అక్కడ నిలబెడతాను. మీ డాక్టర్లు అందరూ అతనికి పరీక్ష చేసి అతని కులం, ఏ వర్గానికి చెందిన వ్యక్తే తేల్చి చెబితే నేను మీ అందరినీ ఒప్పుకుంటాను. తమ దగ్గర కులం అనేది ఉండకూడదు. మీరు ఇంత దూరం వచ్చి బాగా చదువుకుని కులం అంటే ఎలా అని హెచ్చరించారు. అంతటి మహానుభావుడు రామోజీరావు." - మురళీ మోహన్​, సినీ నటుడు

తెలుగు జాతి కీర్తి శిఖరం రామోజీరావు - ఆయన విలువలూ విశ్వాసాలు మీకోసం - Ramoji Rao Success Story

ఐదక్షరాల మంత్రాక్షరి, అద్భుతాల పంచాక్షరి - రామయ్య 'రామోజీరావు'గా ఎదిగారిలా - Biography of Media Mogul Ramoji Rao

Last Updated : Jul 17, 2024, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.